పాత్రికేయ వృత్తిలో సుదీర్ఘ అనుభవం, ప్రజా సమస్యలపై విస్తృత అవగాహన ఉన్న సీనియర్ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం సమక్షంలో ఆయన నేడు నియామక ఉత్తర్వులు అందుకున్నారు. అంధ్రప్రభలో పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభించిన అయన ఇండియన్ ఎక్స్ ప్రస్, దక్కన్ కాన్రికల్, ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికలలో వివిధ హోదాలలో పని చేసారు. ఎలక్ట్రానిక్ మీడియాలో తనదైన ముద్రను చూపారు. జెమిని టివిలో సుదీర్ఘ కాలం ప్రచారం అయిన పత్రికా ప్రపంచం కార్యక్రమంతో పాటు, దూరదర్శన్ లో అభివృద్ది కార్యక్రమాలనుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హెచ్ ఎం టివిలో దశ దిశ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో నాటి సమైక్య రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసింది. వందేళ్ల కధకు వందనాలు పేరిట నిర్వహించిన కార్యక్రమం సాహితీ ప్రియులతో పాటు, సగటు మనిషిని కూడా ఆకర్షించింది. నేటి తరం జర్నలిస్టులకు మార్గదర్శిగా ఉన్న రామచంద్రమూర్తిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమించటం ద్వారా పత్రికా ప్రతినిధులకు తమ ప్రభుత్వం ఇస్తున్న గౌరవాన్ని చెప్పకనే చెప్పారు. ఈ నేపధ్యంలో రామచంద్రమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ప్రజలకు అవసరమైన విధానాల రూపకల్పనలో ప్రభుత్వానికి సహాయ కారిగా ఉంటానని తెలిపారు
previous post