37.2 C
Hyderabad
March 29, 2024 17: 27 PM
Slider జాతీయం

ఇన్ టైం ప్లీజ్:కేజ్రీవాల్ నామినేషన్ వేస్తాడా లేదా

krajival namination intime

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మరికాసేపట్లో సమయం ముగుస్తుందనగ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ వేస్తాడా లేదా అనే సందిగ్ధం నెలకుంది. ఈ రోజు నామినేషన్‌ వేయడానికి వచ్చిన కేజ్రీవాల్ క్యూలో నిలబడ్డారు. ఆయన ముందు దాదాపు 50 మంది స్వతంత్ర అభ్యర్థులు క్యూలో ఉండడం గమనార్హం.

నామినేషన్ వేసేందుకు కార్యాలయానికి ఆయన తన తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. కేజ్రీవాల్‌ను స్వతంత్ర అభ్యర్థులు ముందుకు వెళ్లనివ్వట్లేదు. తమలాగే క్యూలో నిలబడాల్సిందేనని పట్టుపడుతున్నారు.మధ్యాహ్నం మూడు గంటల్లోపు అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది.

నిన్న భారీ రోడ్ షో కారణంగా నిర్ణీత సమయానికి నామినేషన్ దాఖలు చేయాల్సిన కార్యాలయానికి చేరుకోలేకపోవడంతో నిన్న వెనక్కి వెళ్లారు. ఈ రోజు కూడా ఆయనకు విచిత్ర పరిస్థితి ఎదురైంది.ఐతే నిర్ణిత సమయంలో లోపల ఉన్నవారిని నామినేషన వేయడానికి అధికారులు అనుమతించవచ్చనే కారణంగా అయన నామినేషన్ ఈ రోజు దాఖలు చేయవచ్చనే భావిస్తున్నారు.

Related posts

అర్హులైన వారందరికి రుణ మాఫీ అందాలి

Bhavani

మున్సిపల్ కార్యాలయం నూతన భవనాన్ని పరిశీలించిన మంత్రి

Satyam NEWS

అక్టోబర్ 2న గాంధీ ఆసుపత్రి ఎదుట గాంధీ విగ్రహావిష్కరణ

Satyam NEWS

Leave a Comment