ముఖ్యంగా ఏపీకి చెందిన ఆ ఇద్దరి వైసిపి నేతల్ని అంటున్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్లు గత ప్రభుత్వంలో వ్యవహరించిన తీరువల్ల ఊరు వాడ వదిలి తిరగవలసి వస్తుంది అంటున్నారు. సరిగ్గా రెండు నెలల క్రితం తొడగొట్టి సవాల్ చేసిన నాయకులు తమ ఎక్కడ ఉన్నది ఎవరికి చెప్పకుండా గడుపుతున్నారు కర్మఫలం అంటే ఇదేనేమో అంటున్నారు.
ఇంతకీ ఎవరు ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనూహ్య మార్పులు జరుగుతున్నాయి ప్రధానంగా గత ప్రభుత్వంలో దాడులు దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఇద్దరు నేతలను వెంటాడుతుందని చెప్తున్నారు ఎన్నికలు ఫలితాలు వెలుబడిన తర్వాత ఆ ఇద్దరు అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు వారికోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలుస్తున్నాయని చెప్తున్నారు ఇద్దరిలో ఒకరు మాజీ మంత్రి కొడాలి నాని మరొకరు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గతంలో టిడిపి పనిచేసిన ఈ ఇద్దరు నేతలు పార్టీ మారి వైసిపిలో చేరారు ఆ తరువాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అయ్యారు అదే సమయంలో పలు కేసుల్లో వారి ప్రమేయం ఉందని బయటపడడంతో పోలీసులు కేసులు నమోదయ్యాయి ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఎన్నికల ఫలితాల తర్వాత వారం పది రోజులు గుడివాడలో గడిపిన మాజీ మంత్రి కొడాలి నాని ఆ తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలియదు.
అదేవిధంగా కొడాలి నాని వల్లభనేని వంశీ తనను వేధించారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్పూరి కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదయింది ఇక గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో సిబిఐ కేసు కూడా నమోదయింది ఈ కేసులో ఇప్పటికే 19 మంది పోలీసులు అరెస్టు చేయగా వంశీ కోసం గాలిస్తున్నారు. అలాగే కార్పొరేషన్ విషయంలో తమ గోడౌన్ యజమానులు ఫిర్యాదులు చేశారు. తమ చేష్టలతో ఐదేళ్లపాటు టిడిపి కార్యకర్తలను వేధించిన కొడాలి నాని వంశీ ఆర్థిక మూలాలను ఇప్పటికే ప్రభుత్వం దెబ్బతీసిందని చెప్తున్నారు. అయితే ఈ విషయాలను ఇద్దరూ బయటకు చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు మరోవైపు వంశీ అనుచరులను అరెస్టు చేస్తున్న ఆయనకు రాజకీయ ఉన్న లింకులను దూరం చేస్తున్నారు దీంతో గడ్డి పరిస్థితులు తప్పక పోవచ్చు అని అంటున్నారు.
వల్లభనేని వంశీ రాజకీయ సన్యాసం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న చంద్రబాబు గెలిస్తే సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరిన కొడాలి నాని తన మాటపై నిలబడతారా అని ప్రశ్నిస్తున్నారు టిడిపి కార్యకర్తలు ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలే పరిస్థితి లేకపోవడంతో వారి ప్రతికూల పరిస్థితుల నుండి ఎలా బయటపడతారు అనేది ఆసక్తికరంగా మారింది.