32.7 C
Hyderabad
March 29, 2024 10: 46 AM
Slider కృష్ణ

శ్రీ రామజన్మభూమి మందిర నిర్మాణానికి కలెక్టర్ ఇంతియాజ్ విరాళం

#KrishnaDistCollector

శ్రీ రామజన్మభూమి ఆలయ నిర్మాణానికి తనవంతుగా 25 వేల రూపాయలను కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి . ఇంతియాజ్ విరాళంగా ఇచ్చారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ దళ్ ( ఆర్ఎస్ఎస్ ) రాష్ట్ర చీఫ్ భరత్ జీ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, జిల్లా ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు శ్రీ రామజన్మభూమి ఆలయ నిర్మాణానికి రాష్ట్రంలో పలు ప్రజా ప్రతినిధులను, అధికారులను కలుస్తున్నారు.

ఇందులో భాగంగా శనివారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో కలెక్టు ను కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రామజన్మభూమి ఆలయ నిర్మాణానికి దేశంలోని ప్రతి వ్యక్తి భాగస్వామ్యం ఉండాలని విరాళాల సేకరణ జరుగుతోందన్నారు.

ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చేందుకు దేశంలోని ప్రముఖలేందరో ముందుకు వస్తున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి విరాళాల సేకరణకు మంచి స్పందన ఉందన్నారు. దాదాపు 450 ఏళ్ళ సుదీర్ఘ పోరాటనరతం ఆలయ నిర్మాణం జరుగుతోందన్నారు.

పార్టీలు , కులాలు , మతాలకు అతీతంగా విరాళాల సేకరణల్లో ఎందరో స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారన్నారు. రాముడు కొందరివాడు కాదని అందరి వాడని ఆయన చెప్పారు. కొడుకుగా , భర్తగా , అన్నగా , రాజుగా శ్రీ రామరాజ్యం స్థాపించిన ఆయన ప్రజల మన్ననలు పొందారన్నారు.

జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ ఇచ్చిన ఈ 25 వేల రూపాయల విరాళం పరమత ప్రోత్సహనికి నిదర్శనం అన్నారు. ఆయన ఇచ్చిన విరాళం దేశంలో మత సామరస్యాన్ని, ఐక్యత భావాన్ని చాటుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ చెప్పారు.

జిల్లా కలెక్టర్ ఏ.యండి ఇంతియాజ్ మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు అందరికి ఆదర్శనీయులన్నారు. రాజ్య పాలనతో ప్రజల బాగోగులుతో పాటు సంక్షేమాన్ని కూడా చూశాడన్నారు. ఉడత భక్తిగా తన వంతు విరాళాన్ని ఈ చిన్న మొత్తాన్ని అందిస్తున్నాని ఆయన తెలిపారు.

Related posts

‘సాక్షి’ పై కేసు: కోర్టు ఆదేశాలతో ఎఫ్.ఐ.ఆర్ నమోదు

Satyam NEWS

జెండా కప్పుకుంటేనే సంక్షేమ పథకాలా..?

Bhavani

ఏప్రిల్ 22 నుండి ఇంటర్ పరీక్షలు

Sub Editor 2

Leave a Comment