29.2 C
Hyderabad
September 10, 2024 15: 37 PM
Slider కృష్ణ

కృష్ణమ్మ హారతి పున:ప్రారంభం

#anamramanarayanareddy

గోదావరి-కృష్ణా సంగమ ప్రాంతమైన పవిత్ర సంఘమం(ఇబ్రహీంపట్నం) ఫెర్రీ వద్ద నెలరోజుల్లోగా కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని పున:ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో కృష్ణమ్మ హారతి కార్యక్రమం పున:ప్రారంభానికి సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం(జిఓఎం)సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సియం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతిని ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిత్యం నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే గత ఐదేళ్ళ కాలంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మరలా కృష్ణమ్మహారతిని నెల రోజుల్లోగా  పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

కావున కృష్ణమ్మ హారతి నిర్వహహణకు గాను పవిత్ర సంఘమం-ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అవసరమైన కనీస మౌలిక సదుపాయాలైన రహదార్లు,విద్యుత్,బస్సు రవాణా,పారిశుద్ధ్య నిర్వహణ వంటి సదుపాయాలను పూర్తి స్థాయిలో పునరుద్దరించేందుకు సంబంధిత శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఎన్టిఆర్ జిల్లా యంత్రాంగం, జలవనరులు, సిఆర్డిఏ, దేవాదాయశాఖ, దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం,పోలీస్, ట్రాన్సుకో,మున్సిపల్ తదితర శాఖల అధికారులు వారి స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించుకుని తగు చర్యలు చేపట్టాలన్ని మంత్రి ఆదేశించారు.

రానున్న రోజుల్లో పవిత్ర సంఘం వద్ద కేవలం కృష్ణమ్మ హరతికే పరిమితం కాకుండా ఆ ప్రాంతాన్ని ఒక పవిత్ర ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆ దిశగా తగిన చర్యలు తీసుకోనున్నట్టు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాటైన మంత్రుల కమిటీ తొలి సమావేశం జరిగిందని అధికారుల స్థాయిలోను,జిల్లా యంత్రాంగం స్థాయిలోను సంబంధింత శాఖల అధికారులతో మరిన్ని సమావేశాలు నిర్వహించి త్వరిత గతిన కృష్ణమ్మ హారతిని పున:ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

రాజమహేంద్రవరంలో గోదావరి హారతి ప్రస్తుతం కొనసాగుతోందని దానిని మరింత పటిష్టవంతంగా నిర్వహించేందుకు కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కె.పార్ధసారధి మాట్లాడుతూ కృష్ణమ్మ హారతి అనేది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని దానిని నెలరోజుల్లోగా పున:ప్రారంభించేందుకు చర్యలు తీసుకోడం జరుగుతుందని తెలిపారు.

అక్కడ టిటిడి లేదా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆప్రాంతాన్ని రాష్ట్రానికే ఒక ప్రముఖ పర్యాటక,ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు.అక్కడకు వచ్చే పర్యాటకులు,భక్తులు తదితరులకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఆదిశగా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని పునరుద్దరించడంతో పాటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక ఫ్యాకేజి టూర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పార్ధసారధి సూచించారు.

దేవాదాయశాఖ కమీషనర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ 2016 నుండి పవిత్ర సంఘమం వద్ద కృష్ణమ్మ హరతి నిర్వహించబడేదని కొవిడ్ అనంతరం నిర్వహించలేదని చెప్పారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వద్ద ప్రతి రోజు నిత్య జలహారతిని దేవస్థానం నిర్వహిస్తోందని తెలిపారు. మరలా కృష్ణమ్మ హరతి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందును అందుకు సంబంధించిన ఏర్పాట్లను యుద్ద ప్రాతిపదికన చేపట్టాల్సి ఉందని కావున సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎన్టిఆర్ జిల్లా కలక్టర్ సృజన మాట్లాడుతూ ఇప్పటికే పవిత్ర సంఘమం, ఇబ్రహీం పట్నం ఫెర్రీవద్ద జంగిల్ క్లియరెన్సు పనులను చేపట్టడం జరిగిందని చెప్పారు.విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇఓ రామారావు మట్లాడుతూ కృష్ణమ్మ హారతి నిర్వహణకు 6పంట్లు,10 సెట్ల హరతులు అవసరం ఉందని చెప్పారు. అదే విధంగా మంచి సౌండ్ సిస్టమ్ తోపాటు 13 మంది అర్చకులు వారికి సహయకులుగా మరో 20 మంది సిబ్బంది అవసరం ఉందని అన్నారు. ఇంకా పోలీస్, సిఆర్డిఏ, ట్రాన్సుకో, ఐఅండ్ పిఆర్,అగ్నిమాపక,మున్సిపల్,పర్యాటక తదితర విభాగాల తరపున చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులు వివరించారు. ఇంకా ఈసమావేశంలో డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ మురళి, విజయవాడ పశ్చిమ డిసిపి టి.హరికృష్ణ,ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

మట్టిఖర్చుల విషయంలో కూడా విఆర్ఏ లకు జగన్నన్న మోసం

Satyam NEWS

రైతులను విస్మరించి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ సర్కార్

Satyam NEWS

ప్రతిభ కనబరిచిన మానస

Bhavani

Leave a Comment