యోగం చేస్తే… చేస్తేనే జ్ఞానం కలుగుతుందని అంతర్ముఖానంద శ్రీ గురూజీ అన్నారు. భగవాన్ శ్రీకృష్ణ జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా కామన్నవలస శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురూజీ ప్రవచించారు. జ్ఞానం పొందాలన్నా, కావాలన్న మనస్సును స్వాధీన పరుచుకునే యోగాన్ని నిరంతరం సాధన చెయ్యాలన్నారు..ఉదయం సద్గరు బ్రహ్మర్షి శ్రీ స్వామి రామానందుల వారి సమాధి మందిరంలోను అటు శ్రీగురు పీఠంలోనూ పూజ జరిగింది.
అనంతరం బౌద్ధిక మండపంలో జరిగిన ఆధ్యాత్మిక సభలో శ్రీ గురూజీ మాట్లాడుతూయోగమనే కర్మ చేస్తేనే పరమాత్మను తెలుసుకోగలమన్నారు. కర్మ సన్యాసం కన్న కర్మ యోగం గొప్పదని శ్రీగురూజీ అన్నారు. ఆశ్రమంలో జరిగిన శ్రీకృష్ణ జయంతికి హైదరాబాద్, తిరుపతి, కాకినాడ, విజయవాడ, వైజాగ్, విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం తదితర ప్రదేశాల నుంచీ శిష్యులు పాల్గొన్నారు. అన్నింటిని స్వాధీనం చేసుకోవాలంటే ప్రాణాయామ యోగ సాదనే అని శ్రీగురూజీ అన్నారు. వాసనలను నశింప చేసేదే ప్రాణాయామం అని అన్నారు. ఇదే భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారని… దాన్నే భగవద్గీతలో పొందుపరిచారని శ్రీ స్వామి అంతర్ముఖానంద అన్నారు.