30.7 C
Hyderabad
April 24, 2024 02: 18 AM
Slider ఆధ్యాత్మికం

గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో ద్వార‌క‌ను త‌ల‌పించిన తిరుమ‌ల‌

#Tirumala

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ  తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదికపై సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో భాగంగా బుధ‌వారం ఉద‌యం శ్రీకృష్ణ జన్మాష్టమి పారాయ‌ణం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా భ‌క్తుల గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో తిరుమ‌ల గిరులు ద్వార‌క‌ను త‌ల‌పించాయి. తిరుమ‌ల‌లో టిటిడి నిర్వహిస్తున్న పారాయణ‌ కార్య‌క్ర‌మం బుధ‌వారం 125వ రోజుకు చేరుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని వ్యాస‌మ‌హర్షి ర‌చించిన భాగ‌వ‌తంలోని ద‌శ‌మ‌స్కంధం మూడ‌వ ఆధ్యాయంలోని శ్రీ‌కృష్ణుని జ‌ననం పారాయ‌ణం చేశారు. 

ఆనంత‌రం తిరుప‌తి ఇస్కాన్ నుండి వ‌చ్చిన 20 మంది భ‌క్తులు నామ‌సంకీర్త‌న నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, డెప్యూటీ ఈవోలు హ‌రీంద్ర‌నాధ్‌, బాలాజి, ఎస్వీ వేద ఉన్న‌త వేద అధ్యాయ‌న‌ సంస్థ ప్ర‌త్యేకాధికారి విభీష‌ణ శ‌ర్మ తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని పాల్గొన్నారు. 

తిరుమలలో శ్రీకృష్ణ‌స్వామివారికి విశేష అభిషేకం

తిరుమలలో శుక్ర‌వారంనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వ‌ర్యంలో  నిర్వహించారు. గోగర్భం డ్యామ్‌ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి  ఉదయం 10.00 గంట‌ల నుండి పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, కుంకుమ‌, చంద‌నం, పంచామృతాభిషేకాలు చేశారు.

ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో చాలా పరిమిత సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Related posts

మద్యం దుకాణం లో మంటలు

Bhavani

క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

Satyam NEWS

బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment