25.2 C
Hyderabad
January 21, 2025 11: 55 AM
Slider ప్రత్యేకం

జగన్ రెడ్డి కేటీఆర్ బంధానికి ఆలంబన గ్రీన్ కో

#jaganKTR

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు గ్రీన్ కో. ఈ సంస్థ తన సబ్సిడరీ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది. అలాగే ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్‌లో స్పాన్సర్‌గా చేసింది. తన ఓ సబ్సిడరీ కంపెనీ తరపున ఈ స్పాన్సర్ షిప్ చేసింది. తాము ఇలా డబ్బులు ఖర్చు పెట్టేయడం వల్ల తమకు లాభం లేదని రెండో ఏడాది స్పాన్సర్ షిప్ రద్దు చేసుకుంది. అయితే బీఆర్ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది. ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని భరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

దాదాపుగా రెండు వందల కోట్లు ఈ రేసు కోసం ఖర్చు చేసేందుకు తెలంగాణ సర్కార్ ఒప్పుకుంది. ముందస్తుగా రూ. 55 కోట్లు చెల్లించింది. అందుకు అనుమతులు తీసుకోలేదు. అదీ కేసు. ఇప్పుడు గ్రీన్ కో కంపెనీ ఎవరిది అన్న ప్రశ్న ఎక్కువగా వస్తోంది. వైసీపీ నేత, కాకినాడ నుంచి ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ కుటుంబానిది గ్రీన్ కో కంపెనీ. గ్రీన్ ఎనర్జీ రంగంలో వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్న సంస్థ. తెలంగాణలో బీఆర్ఎస్.. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ సంస్థ విపరీతంగా విస్తరించింది.

ఈ క్రమంలో ఆ రెండు పార్టీలతో సన్నిహితమయ్యారు. అయితే సునీల్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతారు. మొదట పీఆర్పీ నుంచి ఆయన పోటీ చేశారు. తర్వాత వైసీపీ, టీడీపీ, వైసీపీ మార్చి మార్చి పోటీ చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడూ గెలవలేదు. ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లాలన్న ప్రచారం జరిగింది. కానీ ఇంకా ముందడుగు పడలేదు. ఇప్పటికైతే వైసీపీ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదు. చలమలశెట్టి సునీల్ సోదరుడు అనిల్ మొత్తం వ్యాపారాలను చూస్తూంటారు.

ఆయన సినీ ఇండస్ట్రీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను మాల్దీవ్స్ లో నిర్వహించారు. దీనికి టాలీవుడ్ పెద్ద హీరోలను ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్లారు. ఆ వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అది ఆయన రేంజ్ అన్నట్లుగా ఉంటుంది. గ్రీన్ కో వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అన్ని చోట్లా సోదాలను చేసి అయినా … పాత ఖాతాలు ఏమైనా ఉంటే వాటిని కూడా వెలికి తీయాలన్నా ప్రయత్నంలో ఉంది. ఈ కారణంగా గ్రీన్ కో కూడా ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts

ఉపాధి కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

నైజీరియా లో ఘోరం: 200 మంది చిన్నారుల‌ కిడ్నాప్

Satyam NEWS

రక్త నిల్వలు నిండుకున్నాయి.. రక్తదానానికి ముందుకు రండి..

Satyam NEWS

Leave a Comment