27.7 C
Hyderabad
April 26, 2024 03: 49 AM
Slider ప్రపంచం

దావోస్ సెషన్:వరల్డ్ ఎకనమిక్‌ ఫోరం వార్షిక సదస్సుకు

ktr davos

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్విట్జర్లాండ్‌ బయల్దేరివెళ్లారు. దావోస్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు టీఆర్‌ఎస్‌ స్విట్జర్లాండ్‌ శాఖ ఘన స్వాగతం పలికింది. టీఆర్‌ఎస్‌ స్విట్జర్లాండ్‌ అధ్యక్షులు గందె శ్రీధర్‌ మంత్రికి స్వాగతం పలికారు. రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు మంత్రి చేస్తున్న కృషి ఫలించాలని ఆయన ఆకాక్షించారు

తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ముందుకెళుతున్నారు. మన రాష్ట్రంలో విరివిగా ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తూ… ప్రసిద్ధ కంపెనీలు తరలివచ్చేలా కృషి చేస్తున్నారు. కేటీఆర్ చొరవతో ఇప్పటికే అనేక సంస్థలు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సదుపాయాలతో… ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు సాధించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే వరల్డ్ ఎకనమిక్‌ ఫోరం ఆహ్వానం మేరకు సదస్సులో పాల్గొనేందుకు… స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌ నగరానికి వెళ్లారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్ తదితరులు కేటీఆర్ వెంట ఉన్నారు.

వరల్డ్ ఎకనమిక్‌ ఫోరం వార్షిక సదస్సు… రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు జరుగనుంది. నాలుగో పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక ప్రయోజనాలు – సవాళ్లను నివారించడం అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ప్రభుత్వ ప్రగతిని వివరించనున్నారు.

Related posts

గ్లోబరీనా..ఓ గ్లోబరీనా.. ఓహో గ్లోబరీనా

Satyam NEWS

ఏ పార్టీ అయినా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా వస్తే ఖబర్దార్

Satyam NEWS

మంత్రి గంగుల ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు

Bhavani

Leave a Comment