రెబల్స్ గా గెలిచినా వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోవడం ఉండదని కేటీఆర్ హెచ్చరించగా అది ఇప్పుడు ఆయనకే గుదిబండ అయింది.రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. అయితే, ఈ ఎన్నికలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చాయి. కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికర ఫలితాలు వెలువడ్డాయి
సిరిసిల్ల మున్పిపాలిటీకి సంబంధించి 39 వార్డులకు ఓట్ల లెక్కింపు పూర్తికాగా అందులో టీఆర్ఎస్ 24 వార్డులు, బీజేపీ 3, కాంగ్రెస్ 2 వార్డుల్లో గెలిచాయి. 10 స్థానాల్లో టీఆర్ఎస్ రెబల్స్ విజయబావుటా ఎగరేశారు. రెబల్స్ ను బుజ్జగించేందుకు ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేసింది. అయినా వారు మాట వినలేదు.అలాగే తెలంగాణాలో కొన్ని చోట్ల రెబల్స్ లేకుండా చిత్రమా ఎన్నిక జరగని పారిస్తుతులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ముఖ్యంగా ఈ ఎన్నికలలో తెరాస ను విజయ తీరాలవైపు నడిపిన మంత్రి కేటీఆర్ రెబల్స్ పై ఏవిధమైన నిర్ణయం తీసుకుంటాడో ననే ఆసక్తి నెలకొంది.ముఖ్యం గా సిరిసిల్ల లో అయన తీసుకునే నిర్ణయం గజవెల్ పై ఆ తరువాత మిగతా మున్సిపాలిటీలపై పడే అవకాశముంది.