అన్ని రంగాలలో రాజన్నసిరిసిల్లా జిల్లాను అగ్రగామి గా తీర్చి దిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు అన్నారు.ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నా మంత్రి కేటీఆర్ గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టు గెస్ట్‌హౌజ్‌లో నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సిరిసిల్ల నియోజక వర్గము లో చేప్పట్టిన పలు పనుల పురోగతిని అయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.తాగు నీరు,విద్య,వైద్య లకు ప్రాధాన్యత ఇవ్వాలని అయన అధికారులను కోరారు.ఈ సమావేశంలో సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.మొదట సిరిసిల్ల నియోజక వర్గ అభివృద్ధి పనులను సమీక్షించిన అయన జిల్లాలో అభివృద్ధి ఫై చర్చించారు.ముఖ్యం గా రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగిరం గా జరిగేలా చూడాలని అయన కోరారు.ఇది కోసం భూసేకరణ వేగాంగా పూర్తి చేయాలని రానున్న రోజుల్లో సిరిసిల్ల ప్రజలకు రైల్ కూత వినపడాలని కోరారు.