36.2 C
Hyderabad
April 24, 2024 19: 50 PM
Slider కరీంనగర్

కష్టకాలంలో నేతన్నలకు ప్రభుత్వ చేయూత

#Minister KTR

ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలోని నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం మరో ప్రత్యేకమైన చర్య తీసుకున్నట్లు తెలంగాణ మునిసిపల్, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని నేతన్నల వద్ద మరింత నగదును పెంచే ఉద్దేశంతో గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన నేతన్నకు చేయూత పథకాన్ని లో భాగంగా గడువు పూర్తి కాకముందే నేతన్నలకు నగదు సాయం అందించేందుకు ఈరోజు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

ప్రస్తుతం ఉన్న గడువు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేతన్నకు చేయూత పొదుపు పథకానికి సంబంధించి  పథకంలో చేరిన నాటి నుంచి లాకిన్ పీరియడ్ ఉంటుందని, అయితే  ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే నేతన్నలు ఈ పథకం నుంచి నగదు అందుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

నేతన్నలకు మేలు చేసే పథకాన్ని ప్రారంభించాం

గతంలో ఈ పథకంలో భాగంగా  చేనేత కార్మికులు ఎనిమిది శాతం తమ వాటా జమ చేస్తే దానికి రెట్టింపు 16 శాతం ప్రభుత్వ వాటా నేతన్నకు చేయూత కార్యక్రమంలో భాగంగా జమ చేసేదన్నారు. దీంతోపాటు పవర్లూమ్ కార్మికుల 8 శాతం నేతన్నల వాటాకు సమానంగా మరో ఎనిమిది శాతం ప్రభుత్వం జమ చేసేది.

మూడు సంవత్సరాల పాటు ఈ పథకానికి లాకిన్ పీరియడ్ ఉన్నది. ఇప్పటిదాకా కార్మికులు సుమారు 31 కోట్ల రూపాయలు జమ చేస్తే ప్రభుత్వ వాటాగా 62 కోట్ల రూపాయలను అదనంగా జమ చేసిందన్నారు. ఈ మినహాయింపు ద్వారా తక్షణమే 26500 మంది నేతన్నలకు ఉపశమనం లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపు తో ఈ పథకంలో భాగస్వాములైన నేతన్నలకు 50 వేల నుంచి సుమారు లక్షా 25 వేల వరకు నగదు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీంతోపాటు సొసైటీల పరిధిలో ఉన్నటువంటి కార్మికులకు గతంలో ముగిసిన పొదుపు పథకం యొక్క డబ్బులను చెల్లించడం ద్వారా మరో కోటి 18 లక్షల రూపాయలు నేతన్నలకు అందించనున్నట్లు తెలిపారు.

నేతన్నలకు ముందు నుంచి అండగా ఉన్నది మేమే

ఈ డబ్బులు సుమారు 2337 మంది  కార్మికులకు అందుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు ముందు నుంచి అండగా ఉంటూ వస్తున్నదని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంతో పాటు,వారి ఉత్పత్తులకు డిమాండ్ కల్పించే దిశగా అనేక కార్యక్రమాలను తీసుకున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ప్రస్తుతం ఉన్న ఆపత్కాలంలో నూ నేతన్నలను ఆదుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే అన్ని పరిస్థితులు సర్దుకుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశం సందర్భంగా మంత్రి బతుకమ్మ చీరల ఉత్పత్తి ప్రక్రియను పురోగతిని సమీక్షించారు.

ఈరోజు టీ ఎస్ ఐ ఐ సి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి పరిశ్రమల శాఖ పైన సమీక్షించారు. ఈ సమావేశంలో వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తో పాటు హైదరాబాద్ ఫార్మా సిటీ నీ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో ఏరోస్పేస్ డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమల శాఖ లోని పలు విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో టీ ఎస్ ఐ ఐ సి చైర్మన్ బాలమల్లు తోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజ రామయ్యార్, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

బంజారా హిల్స్ లో ప్యుర్ ఓ నాచురల్ ను ప్రారంభించిన సుచిత్ర ఎల్లా

Satyam NEWS

కఠిన నిబంధనలపై ఏపీలో ప్రధానోపాధ్యాయుల నిరసన

Satyam NEWS

పాత్రునివలసలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం

Bhavani

Leave a Comment