Slider తెలంగాణ

కొల్లాపూర్ ప్రచార సరళిపై కేటీఆర్ అసంతృప్తి

ktr kollapur

మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార సరళిపై మంత్రి కేటీఆర్ నేడు సమీక్ష నిర్వహించారు. తెలంగాణా భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా  కొల్లాపూర్ మున్సిపాలిటీ పై సమీక్ష నిర్వహించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలలో గెలిచేందుకు జరుగుతున్న ప్రచార సరళిని, పార్టీ తీరును కేటీఆర్ సమీక్షించారు. కొల్లాపూర్ లో పార్టీ పరిస్థితిపై కేటీఆర్ తీవ్ర సంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కొల్లాపూర్ లో ఆశించిన స్థాయిలో ప్రచారం జరగడం లేదని కేటీఆర్ అన్నారని తెలిసింది. దీనిపై వివరణ ఇవ్వబోగా పార్టీ పరిస్థితి మెరుగు పడిన తర్వాత వచ్చి కలవండని కొల్లాపూర్ ఎమ్మెల్యేకు కేటీఆర్ చెప్పినట్లుగా తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తో బాటు మునిస్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ చాడ కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రీసెర్వ్డ్:రైల్ లో పరమేశ్వరునికి ప్రత్యేక బెర్త్

Satyam NEWS

కరోనాతో తొలి తెలుగు జర్నలిస్టు మరణం

Satyam NEWS

తప్పుడు ఆరోపణ చేసిన వారు బహిరంగ చర్చకు సిద్ధమేనా?

Satyam NEWS

Leave a Comment