కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడ నియోజకవర్గంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వంద కోట్ల నిధులతో నిర్మాణం జరిగిన మినీ ట్యాంక్ బండ్ మినిస్టేడియం నాలుగు వరుసల రోడ్లను ఆయన ప్రారంభం చేశారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఐటి శాఖ మంత్రి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత స్పీకర్ పోచారం కే దక్కుతుందన్నారు. గతంలో అనేక శాఖలలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు వుండటం వల్లనే బాన్స్‌వాడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.
ఏ సమస్య ఉన్నా తానే స్వయంగా వెళ్లి పరిష్కరించడం అయినా గొప్ప వ్యక్తిత్వానికి దర్శనమని పోచారం పొగడ్తలతో ముంచెత్తారు. బాన్సువాడ పట్టణమును పోచారంను అందరూ ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ వ్యవహారాలు రహదారులు భవనములు గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల అధికార యంత్రాంగం తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.