అధికారం కోల్పోయిన తర్వాత శర వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు వైసీపీని గల్లంతు చేస్తున్నాయి. వైనాట్ 175 నినాదంతో ఎన్నికల రంగంలోకి దిగిన వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచింది. ఒక దశలో 500 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అయినా సరే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవాలని జగన్ రెడ్డి ప్రయత్నించారు. చిత్తూరు జిల్లాకు చెందిన అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎర్రచందనం డబ్బులన్నీ కుప్పలో కుమ్మరించారు కూడా. అక్కడ పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడిని ఓడించేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శతవిధాలా ప్రయత్నించాడు.
అయితే కాలం ఖర్మం కలిసిరాక జగన్ రెడ్డి ఆయన కోటరీ మొత్తం చతికిలపడింది. భారీ మెజారిటీతో చంద్రబాబునాయుడు కుప్పం నుంచి గెలిచారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నాయకులు అక్కడ కనుమరుగు అయ్యారు. కుప్పంలో గతంలో మున్సిపాలిటీని వైసిపి భారీ మెజారిటీతో కైవసం చేసుకోవడం జరిగింది. వైసిపి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కుప్పం లో ఉన్న మున్సిపాలిటీ కౌన్సిలర్లు కొంతమంది టీడీపీలో చేరారు. దాంతో వైసీపీ కుప్పంలో కుదేలైపోయింది. కుప్పంలో పార్టీ కార్యాలయం ను ఖాళీ చేసి ఆ పార్టీ నాయకులు పరారు కావడంతో ఆ స్థలంలో యజమాని అక్కడ హోటల్ ఏర్పాటు చేస్తున్నారు.