40.2 C
Hyderabad
April 24, 2024 17: 53 PM
Slider కర్నూలు

డూప్లికేట్ ప్యారాచూట్ ఆయిల్ రెడ్ లేబుల్ టీ పౌడర్ స్వాధీనం

#kurnoolpolice

డూప్లికేట్ ప్యారాచూట్ ఆయిల్, రెడ్ లెబుల్ టీ పౌడర్ తయారీ దారులను నేడు కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు.

 ఇద్దరు తయారీ దారులు , ముగ్గురు అమ్మకందారులు అరెస్టు అయిన వారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా 14,880 నకిలీ ప్యారా చూట్ కొబ్బరి నూనె నింపినబాటిల్స్( 113 బాక్సులు), 5,160  నకిలీ ప్యారా చూట్  కొబ్బరి నూనె నింపని ఖాళీ బాటిల్స్  (12 బాక్సులు), 1,680 నకిలీ రెడ్ లెబుల్ టీ పోడి నింపిన ప్యాకెట్లు ((40 బాక్సులు), 41,400 నకిలీ రెడ్ లెబుల్  టీ పోడి నింపని ప్యాకింగ్ ఖాళీ కవర్స్( 18 బాక్సులు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టుఅయిన వారిలో కమల్ భాఠి(46), కాచిగూడ, హైదరబాద్ సిటి, సంజయ్ (40),   ముసా పేట, హైదరాబాద్, దరూరు సత్యనారాయణ శెట్టి(49), నందికొట్కూరు టౌన్, టంగుటూర్ రవి కుమార్ (46), నంద్యాల టౌన్, షేక్ ఖాదర్ భాషా(46), ఎమ్మిగనూర్ టౌన్ ఉన్నారు. సోమసుందరం (మేనేజర్) ( అన్వేష్ IPR Services అథారైజ్డ్, ప్యారాచూట్, బెంగుళూరు) నందికోట్కూరు పోలీసు స్టేషన్ లో  ఆగష్టు 27 న ఈ కల్తీ సరకు విషయం  ఫిర్యాదు  చేయగా  నందికొట్కూరు పోలీసుస్టేషన్ లో క్రైమ్ నెంబర్ 311/2021 u/S 420 IPCand Sec 51(B)(1) r/w 63 of  Copy Right Act of 1957 and Sec 103, 104 of the Trade Marks  Act 1999 r/w 34 IPC క్రింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు పరిశోధన లో భాగంగా  జిల్లా లో  పలు చోట్ల  సిసియస్ మరియు నందికొట్కూరు పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు.

నందికొట్కూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, కర్నూలు తదితర ప్రాంతాలలో నకిలీ ప్యారా చూట్ కొబ్బరి నూనె బాటిల్స్ రెడ్ లెబుల్ టీ పౌడర్ అమ్ముచున్న వారిని పట్టుకుని విచారించారు.

హైదరాబాద్ లోని కాచిగూడకు చెందిన కమల్ బాఠీ అనే వ్యక్తి ప్యారా చూట్ కొబ్బరినూనె Bottles ను పోలీ ఉండే  బాటిల్స్ ను హైదరాబాద్ లోని ముసాపేటకు చెందిన సంజయ్  అనే వ్యక్తి ద్వారా తయారు చేయించుకుని అందులో రసాయనాలు కలిపిన కల్తీ కొబ్బరి నూనె ను నింపి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్ణాటక, చత్తీస ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్ధాన్ రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూటర్లను నియమించుకుని, వారి ద్వారా షాపులకు సప్లై చేస్తూ అక్రమ తయారీ,  అక్రమ వ్యాపారం చేస్తున్నారు. వీరు కొబ్బరి నూనెలో 1:10 పరిమాణంలో Light Liquid Paraffin Chemical కలిపి కల్తీ కొబ్బరి నూనె ను తయారు చేసి నకిలీ ప్యారా చూట్ బాటిల్స్ లలో ప్యాకింగ్ చేస్తున్నారని తెలిసింది.

అంతేకాకుండా ముద్దాయిలు హిందూస్ధాన్ యూనీ లివర్ కంపెనీకి చెందిన బ్రూక్ బాండ్ రెడ్ లెబుల్ టీ పౌడర్ బాక్సులను పోలిన నకిలీ ఖాళీ ప్యాకింగ్ కవర్స్ లలో నాసిరకం టీ పౌడర్ ను నింపి డీలర్ల ద్వారా అక్రమ వ్యాపారం చేస్తున్న విషయం కేసు పరిశోధన సమయంలో బయటపడింది. సిసియస్ సిఐలు శేషయ్య, ఉపేంద్రబాబు, చంద్రబాబు & టీం,  హైదరాబాద్ కేంద్రంగా అక్రమంగా నకిలీ ప్యారా చూట్ ఆయిల్ తయారు చేస్తున్న  ప్రధాన నిందితుడైన కమల్ భాఠీని,  బాటిల్స్ తయారు చేస్తున్న సంజయ్ ని  అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఈ విషయాలను మీడియాకు తెలియ చేశారు. ఆయన తో పాటు స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి, సిసిఎస్ డిఎస్పి శ్రీనివాసులు, సి ఐ లు శేషయ్య , నాగరాఙా రావు ఉన్నారు.

Related posts

భారత్ లో కొత్తగా 2,876 కరోనా కేసులు 98 మరణాలు

Sub Editor 2

మోదీ పర్యటన ఇలా

Murali Krishna

6 నుంచి లాసెట్‌ దరఖాస్తులు

Sub Editor 2

Leave a Comment