27.7 C
Hyderabad
April 26, 2024 04: 52 AM
Slider కర్నూలు

పిల్లల్ని చంపి తాను చావాలనుకున్న తల్లి చివరికి ఏం చేసిందంటే….

#KurnoolPolice

పిల్లల్ని చంపేసి తాను కూడా చనిపోవాలని అనుకున్నది ఒక తల్లి. నల్లమల అడవిలోకి వెళ్లి పిల్లలకు విషం ఇచ్చి, తాను కూడా తాగింది…… అయితే….. ఎక్కడో……. మాతృప్రేమ మళ్లీ గుర్తుకు వచ్చింది….. అంతే… తర్వాత…..???

నంద్యాల మండలం చాపిరేవులకు చెందిన ఎ.ఆదిలక్ష్మి, తన కుమార్తెలు సుప్రియ (7 ) , చరిత ( 5 ) , యామిని ( 3 ) తో కలిసి శుక్రవారం మధ్యాహ్నం నంద్యాల – గిద్దలూరు ఘాట్ రోడ్డులోని నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నది. ఆత్మహత్య చేసుకోవాలని వచ్చిన ఆదిలక్ష్మి ముందుగా విషపూరిత ద్రావణాన్ని (సూపర్ వాస్మోల్ ) సేవించి,  ఈ తర్వాత సుప్రియ, చరితలకు తాగించింది. వెంటనే భయం పుట్టింది. పిల్లలు చనిపోతే ఎలా? అని అమ్మ ప్రేమ గుర్తుకు వచ్చింది.

అయితే అప్పటికే ఆత్మహత్యాయత్నం చేసేసింది…. ఏం చేయాలి??తన మొబైల్ లో ఉన్న దిశ యాప్ ద్వారా కర్నూలు పోలీసు కంట్రోల్ రూమ్ కు సమాచారం పంపింది. కాల్ సెంటర్ సిబ్బంది వెంటనే మహానంది ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డికి సమాచారమిచ్చారు. ఎస్సై  సత్వరమే రోడ్ సేఫ్టీ సిబ్బంది నూర్ భాషా కు తెలియజేశారు. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్న తల్లి ,కుమార్తెలను అదే వాహనంలో గాజులపల్లెకు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం 108 వాహనంలో మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్ళారు. 

ప్రస్తుతం తల్లీ, బిడ్డల పరిస్ధితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన తెలుసుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ  డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి  చేరుకుని ఆత్మహత్యాయత్నంకు  పాల్పడిన కుటుంబాన్ని పరామర్శించారు. ఆరోగ్య పరిస్ధితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదిలక్ష్మీ భర్త ప్రసాద్ ఏడాది క్రితం వాగులో పడి మృతి చెందాడు.

ఆర్ధిక పరిస్ధితులు బాగాలేనందున ఆ తల్లి ఆత్మహత్యకు సిద్ధపడ్డది…. విషయం తెలుసుకున్న ఎస్పీ 50 వేలు ఆర్ధికసాయం అందించారు. దిశా యాప్ కు సమాచారం అందించినప్పడు సత్వరమే స్పందించిన మహనంది ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డిని ,  రోడ్ సెఫ్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Related posts

బిచ్కుంద‌లో మిన్నంటిన‌ బీజేపీ సంబురాలు

Sub Editor

తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ నుంచి రూ. రెండు కోట్ల విరాళం

Satyam NEWS

పసికందును ఇంట్లో వదిలి.. రైతుల కోసం విధులకు

Satyam NEWS

Leave a Comment