36.2 C
Hyderabad
April 23, 2024 22: 28 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

ఎల్ వి సుబ్రహ్మణ్యంకు ప్రధాని కార్యాలయం పిలుపు

lv modi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి అవమానకరంగా బదిలీ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్ వి సుబ్రహ్మణ్యంకు ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 15వ తేదీన ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలవబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఏకపక్షనిర్ణయాలతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురిఅయిన విషయాన్ని సత్యం న్యూస్ అందరికన్నా ముందుగా వెల్లడించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి జరిగిన పరిణామాలలో భాగంగా ఆయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తో అకస్మాత్తుగా, అత్యంత అవమానకంగా బదిలీ చేయించారు. బాపట్లలోని మానవవనరుల అభివృద్ధి సంస్థకు పంపారు. అయితే ఆయన ఆ పోస్టులో చేరకుండా శెలవుపై వెళ్లారు. ఎల్ వి సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీని ఆ రాష్ట్ర మంత్రులు సంతోషంతో ప్రవీణ్ ప్రకాశ్ తో పంచుకున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని క్రైస్తవ మత సంఘాలు ఎల్ వి సుబ్రహ్మణ్యం బదిలీపై కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి.

ఈ పరిస్థితుల్లో ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ప్రధాని కార్యాలయం నుంచి ఎందుకు పిలుపు వచ్చిందనే సమాచారంలో స్పష్టత లేదు కానీ ఈ నెల 15న ఆయన ప్రధానితో భేటీ కానున్నారనే విషయం మాత్రం స్పష్టం అయింది. ప్రధానితో భేటీ సందర్భంగా ఎల్ వి సుబ్రహ్మణ్యం పలు విషయాలను ప్రస్తావించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తిని అవమానకరంగా బదిలీ చేయడం దేశంలో ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలో జరగలేదు.

దాంతో రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్గతంగా ఏం జరుగుతున్నదనే అంశంపై అందరికి ఆసక్తి నెలకొన్నది. బహుశ ఈ విషయాలపై స్పష్టత కోసం ప్రధాని పిలిచారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎల్ వి బదిలీపై క్రైస్తవ సంఘాలు సంతోషం వ్యక్తం చేయడంపై కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. కొద్ది రోజుల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఎల్ వి తిరుపతి పర్యటనకు వెళ్లడం, అక్కడ ఉన్న అన్యమతస్థులపై కఠినంగా ఉండాలని ఆదేశాలు జరీ చేయడం తెలిసిందే.

తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లే పరిస్థితి ఉంటే అన్యమతస్థుల ఇళ్లకు వెళ్లి మరీ తనిఖీ చేసి వారి మత విశ్వాసాల గురించి వాకబు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇలా దాదాపుగా వంద మంది వరకూ అన్యమతస్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసింది. ఇలాంటి అంశాలన్నీ ప్రధానితో భేటీ సమయంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారిగా కూడా పని చేసిన ఎల్ వి సుబ్రహ్మణ్యంకు దేవస్థానాల విషయంలో పూర్తి పట్టు ఉన్నది. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ లో మత సంబంధ వివాదాలు ఎక్కువైన వేళ ఎల్ వి సుబ్రహ్మణ్యం ప్రధానికి ఏ విధమైన నివేదిక ఇస్తారనే అంశం కూడా తెలియడం లేదు. ఏ కారణం వల్లనైనా 15వ తేదీ ప్రధాని నరేంద్రమోడీ అందుబాటులో లేకపోతే ఎల్ వి ని కలిసే బాధ్యతను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు అప్పగిస్తారని తెలిసింది.

Related posts

హైదరాబాద్ లో వరద నివారణకు మాన్సూన్ ఏమర్జెన్సీ బృందాలు

Satyam NEWS

క‌రోనా దృష్ట్యా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ర‌ద్దు

Satyam NEWS

తహసీల్దార్ విజయను కాల్చేసిన సురేష్ మృతి

Satyam NEWS

Leave a Comment