31.7 C
Hyderabad
April 19, 2024 01: 07 AM
Slider నల్గొండ

కార్మిక చట్టాలను యథాతథంగా కొనసాగించాలి

#CITUC Hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు తెలంగాణ శిల్ప కళా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు అనుబంధ సంఘం హుజుర్ నగర్ పట్టణ అధ్యక్షుడు షేక్ సైదా అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గసభ్యులు యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్న 1996 భవన, ఇతర నిర్మాణ కార్మిక చట్టాన్ని సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తుందని, 1996 చట్టాన్ని యధావిధిగా కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26 వ, తేదీన జరుగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో హుజూర్ నగర్ పరిధిలోని సి ఐ టి యు అనుబంధ సంఘాల కార్మికులందరూ పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఉప్పల గోవిందు,షేక్ సైదా,బంక శ్రీనివాసరెడ్డి, పల్లపు వెంకటేశ్వర్లు, బండి గోపి, వినాయకరావు, వెంకన్న, శ్రీను, కృష్ణ, నరసింహారావు, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీజేవైఎం ఆధ్వ‌ర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం

Sub Editor

నేచురల్ స్టార్ నాని ట్రైలర్ రిలీజ్ చేసిన 125 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం “మానాడు”

Satyam NEWS

అడ్డుకోవాల్సినవారే అంటగట్టారు

Bhavani

Leave a Comment