38.2 C
Hyderabad
April 25, 2024 11: 22 AM
Slider నల్గొండ

కార్మికుల చట్టాలను రక్షించుకోవడానికి ఐక్యంగా పోరాడాలి

#roshapati

మోడీ బారి నుండి భారతదేశం రక్షించుకోవడానికి భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడి 29 కార్మిక చట్టాలు రక్షించుకోవడానికి ముందుకు రావాలని,ఐక్య పోరాటానికి సమైక్యం కావాలని టి ఎన్ టి యు సి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి  కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కార్మికులతో శనివారం టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాల్ని రద్దు చేస్తూ,నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి  కార్మికుల హక్కులను హరించిందని అన్నారు.పెట్టుబడుదారులు బాగు కోసం నాడు భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం దోచుకుంటే నేడు బిజెపి ప్రభుత్వం దోచుకుంటుందని తీవ్రంగా ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు,పెట్రోల్,డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచుతున్నారని, పెరుగుదలకు హద్దులేదని,వాటి మీద నియంత్రణ లేదని అన్నారు.

బిజెపి అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని,అట్లే రాష్ట్రం లోని బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రకటించిందని,కానీ ఈ రెండు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థ లైన బొగ్గు గనులు, విశాఖ ఉక్కు,బ్యాంకింగ్ రంగం,జీవిత భీమా ఎల్ఐసి,రైల్వే,విమానయాన,రక్షణ శాఖలు అన్ని ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారులైన అంబానికి,ఆదాని కి దోచిపెట్టిందని,భారతదేశ ప్రజల ఆస్తిని కాజేసి అన్యాయం చేసిందని  ఆరోపించారు.స్కీమ్ వర్కర్స్ (అంగన్వాడి, ఆశ,మిడ్ డే మిల్స్,కాంట్రాక్టు కార్మికుల కు) న్యాయం చేయాలని ,అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని,తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు,ఐక్య పోరాటాలకు కార్మిక సంఘాలు  సమైక్యం కావాలని దీనికి బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇవ్వాలని శీతల రోషపతి కోరారు.అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి,కౌలు రైతులకి ఎకరానికి 20 వేల రూపాయల చొప్పున ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యు సి  నాయకులు దుర్గారావు,శ్రీను,రవి, లాలయ్య,సైదులు,కోటమ్మ,రాజు,రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

నేపాల్ లో 6.3 తీవ్రతతో భూకంపం

Murali Krishna

ఎటాక్ ఏగైన్:ఇరాక్ లో మళ్ళి ఐదు చోట్ల రాకెట్ దాడులు

Satyam NEWS

భౌరపూర్ శివపార్వతుల కల్యాణోత్సవానికి సకల ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment