32.2 C
Hyderabad
April 20, 2024 19: 28 PM
Slider నల్గొండ

కార్మికులారా ఏకంకండి హక్కులు సాధించే వరకు పోరాడుదాం

#SheetalRoshapati

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక చట్టాల క్రోడీకరణకు నిరసనగా నవంబర్ 26న, దేశవ్యాప్తంగా చేయ తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల పరిధిలోని సిమెంటు పరిశ్రమల కార్మికులంతా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని CITU జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.

కృష్ణపట్టే ఏరియా సిమెంట్ కస్టర్ కమిటీ ఆధ్వర్యంలో మైహోమ్, అంజని, జువారి, సువర్ణ, తదితర సిమెంట్ పరిశ్రమలకు సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం రోషపతి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలను కార్మికులను ఇతర వర్గాల వారిని ఆదుకోవటానికి 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ కేంద్రం ప్రకటించినప్పటికీ దానిలో కార్మికులకు ఇచ్చింది ఏమీ లేవని, పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తూ, ఇంకోపక్క కార్మికులకి నష్టం కలిగించే కరోనా టైంలో 44 చట్టాలను 4 కోల్డ్ గా మార్చటం అతి దారుణమైన చర్యగా అభివర్ణించారు.

కరోనా టైంలో పారిశ్రామిక రంగం తీవ్ర ఒడిదుడుకులకు గురై వ్యాపారం నడవక, కార్మికుల హక్కులని కాలరాయడం, కాంట్రాక్టు కార్మికులను పెద్ద ఎత్తున తొలగించటం, వేతనాల్లో కోత విధించడం, కొత్త ఒప్పందాలు చేయక పోవటం జరుగుతుందని అన్నారు. మన కార్మికుల హక్కులను సాధించుకోవాలంటే కార్మికుల మంతా ఒకటై మన హక్కులను సాధించుకోవడానికి ఈనెల 26న, జరప తలపెట్టిన సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు తీగల శీను, ఎస్ కె. అజమద్దీన్, రాజశేఖర్, సౌరి, లక్ష్మయ్య, బాబు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్యే గూడెం కొడుకు మృతి

Bhavani

లోటస్ ఫీడ్ ది నీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నఅన్నదానం

Satyam NEWS

ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవ్వాల్సిన చేత్తో పార పట్టిన పీసీ..!

Satyam NEWS

Leave a Comment