36.2 C
Hyderabad
April 25, 2024 20: 59 PM
Slider ముఖ్యంశాలు

అడ్డా కూలీల బాధలు లేబర్ అధికారులకు పట్టవా?

#kalwakurthy

అడ్డా కూలీల బాధలు లేబర్ అధికారులకు పట్టవా అని  ఏ ఐ టి యూసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సంత బజార్ ఏరియా లో నాగర్ కర్నూలు పట్టణం, ఎండ బెట్ల, నాగనూల్, ఉయ్యాలవాడ, వనపట్ల, కోటల్ గడ్డ, తిరుమలాపూర్, చర్ల ఇటికాల, దేశి టికాల తదితర గ్రామాల కూలీలు రోజువారి పని కోసం బ్రతుకు దెరువు కోసం వచ్చి పడిగాపులు కాచిన ఉపాధి దొరకక, అడ్డా సౌకర్యం లేక, ఇన్సూరెన్స్ కార్డు లేక, ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేక అనేక రకాల అవస్థలు పడ్డా, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని, అధికారులకు జిల్లా యంత్రాంగానికి పట్టకపోవడం శోచనీయం అని ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ అన్నారు.

బుధవారం  నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం అడ్డ కూలీల సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  లేబర్ అధికారులు , జిల్లా యంత్రాంగం పెద్ద సంఖ్యలో అడ్డ కూలీలు అడ్డ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి అడ్డా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, షెడ్డు నిర్మించి మంచి నీటి సౌకర్యం కల్పించాలని, అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని, ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని, 55 సంవత్సరాలు దాటిన ప్రతి అడ్డా కూలీ కార్మికుడికి ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దళితులు బలహీన వర్గాల వారిని ఆదుకోవాలి

అడ్డా కూలీల లో అత్యధికులు దళితులు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని పలు పర్యాయాలు లేబర్ అధికారులకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వారి అడ్డ సౌకర్యం కల్పించాలని వారి సమస్యలు పరిష్కరించాలని ఫిర్యాదులు చేసినా ఆందోళనలు చేసినా అధికారులకు పట్టడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేరుకే లేబర్ కార్యాలయం కార్మిక శాఖ కార్యాలయం తప్ప ఎక్కడ లేబర్ గురించి పట్టించుకున్న పాపాన ఆ కార్యాలయం నోచుకోలేదన్నారు.

తక్షణ ఇప్పటికైనా అసిస్టెంట్ లేబర్ అధికారి ,అలాగే జిల్లా  ఉన్నత అధికారులు అడ్డా కూలీల దగ్గరికి చేరుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో లేబర్ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో పలురకాల హమాలీలు కార్మికులు సంఘం పెట్టుకోడానికి నిర్మించుకోవడానికి అర్జీలు పెట్టుకొని సంవత్సరం ఆరు నెలల పై గడచిన ఈజీ ఈ నియోజకవర్గాల్లో అధికారికి పట్టకపోవడం వాటిని డి ఎల్ కు పంపకపోవడం అన్యాయమన్నారు. లేబర్ అధికారులు ఉన్నది లేబర్ కోసమా యాజమాన్యాల కోసమా దీన్ని బట్టి అర్థం అవుతుందని ఆయన పేర్కొన్నారు. యజమానులు ఇచ్చే మామూలు, నజరానాలకు అలవాటుపడిన లేబర్ అధికారులు కార్మిక సమస్యలు ఎందుకు పట్టించుకుంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

లేబర్ అధికారుల తీరు మారకపోతే తప్పకుండా లేబర్ ఆఫీస్ ను ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు శ్రీశైలం, సతీష్, అడ్డా కూలీల సంఘం నాయకులు రాము, బంగారయ్య, శేఖర్, కృష్ణయ్య, రాము, జంగయ్య, స్వామి, నరసింహ, చంద్రయ్య, రాములు, ఈశ్వరయ్య, సుధాకర్, అలివేల, ఈశ్వరమ్మ, మన్నెమ్మ, తిరుపతమ్మ, బాలమ్మ, నాగమణి, బాలమణి, ఎల్లమ్మ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గోడదెబ్బ- చెంపదెబ్బ

Satyam NEWS

25న హుజూర్ నగర్ లో జరిగే కార్మిక,కర్షక పోరు యాత్ర జయప్రదం చేయండి

Satyam NEWS

ఘనంగా మాత రామాబాయి అంబేద్కర్ 123వ జయంతి

Satyam NEWS

Leave a Comment