32.7 C
Hyderabad
March 29, 2024 11: 35 AM
Slider ముఖ్యంశాలు

బాన్సువాడలో భారీగా కార్మికుల నిరసన ర్యాలీ

#bansuwada

దేశ వ్యాప్త సమ్మె లో భాగంగా రెండో రోజు కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తా నుండి అర్డిఓ కార్యాలయం వరకు కార్మికుల తో సిఐటియు ఆధ్వర్యం లోభారీ ర్యాలి నిర్వహించారు. ఈ సందర్బంగా సి ఐ టి యు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నెలకు 26వేల వేతనం ఇవ్వాలని కోరుతూ డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా తీసుకువచ్చిన మూడు చట్టాలు రద్దు చెయ్యాలని వ్యవసాయ వ్యతిరేక రైతు చట్టాలు పూర్తిగా రద్దు చేసి గిట్టు బాటు ధరలు కల్పించాలని కార్మికులందరికి ఉద్యోగభద్రత కల్పిస్తూ కనీస వేతనం 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాల మధ్య సాగిన భారీ ర్యాలీ బాన్స్ వాడ ఆర్ డి ఓ కార్యాలయం వరకు ర్యాలీ గా వచ్చి ధర్నా చేపట్టిన అనంతరం 13డిమాండ్ లతో కూడిన వినతిపత్రని ఆర్ డి ఓ కార్యాలయ సూపరిటెండెంట్ కు అందజేశారు.

కార్యక్రమం లో సి ఐ టి యు జిల్లా కమిటీ సభ్యులు జె. రవీందర్, సురేష్ గొండ, ఎం డి ఖలీల్, డివిజన్ పరిధిలోని 9మండలాలకు చెందిన ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ లు, మధ్యాహ్న భోజనఏజెన్సీ కార్మికులు, గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులతో పాటు సి ఐ టి యు నాయకులు ఆడేప్ప, శ్రీనివాస్, రాజు, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

జి. లాలయ్య సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

టియుడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు సన్మానం

Bhavani

మోగిన దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల నగారా

Satyam NEWS

అల్లూరి స్ఫూర్తితో యువ‌త‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించే దిశ‌గా కృషి

Satyam NEWS

Leave a Comment