తెలంగాణా రాష్ట్రం లోని ప్రజలు వివిధ రోగాలతో అల్లాడుతున్నారు. ఒకపక్క వర్షాకాలంలో వచ్చే జ్వరాలు తో నానా ఇబ్బందులు పడుతుంటే మరో వైపు వివిధ ఆసుపత్రులలో సౌకర్యాలు లేకపోవడంతో బాధలు రెట్టింపు అవుతున్నాయి. దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుప్రతులు కూడా వివిధ రోగాలు తో వచ్చే వారితో కిటకిటలాడుతున్నాయి. మలేరియా డెంగ్యూ, టైఫాయిడ్డ్ వంటి వ్యాధులతోవచ్చే రోగుల తో నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లు కిటకిట లాడుతున్నాయి. దీంతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని రోగనిర్ధారణ పరీక్షా కేంద్రాలలో అవసరమైన వైద్యపరీక్షలు అందుబాటులో లేకుండా పోవటంతో ఆర్యోగ్యశ్రీ, ఉద్యోగులు జర్నలిస్టులు కార్డు దారులు నానా ఇబ్బందులుకు గురిఅవుతున్నారు. ప్రస్తుతం నగరంలో డెంగ్యూ జ్వరం బారిన పడుతున్న వారి సంఖ్యా రోజు రోజుకి పెరుగుతోంది. నగరంలోని ఫీవర్ ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి ల మాత్రమే ఈ రోగ నిర్ధారణ పరీక్షా కు అవకాశం ఉంది. అయితే ఇక్కడకి వచ్చే రోగుల సంఖ్యా చాలా ఎక్కువగా ఉండటంతో పరీక్షల నిర్వహణలో కాలయాపన జరుగుతోంది.డెం గ్యూ జ్వరంతో కార్పొరేట్ హాస్పటిల్ లో జాయిన్ అయితే ఐదు లక్షలు వరకూ ఖర్చు అవుతోందని పలువురు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 రోగ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. వీటిన్నిటిలో ప్రజలు వివిధ రోగాలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలలో ఆరోగ్యశ్రీ ఉద్యోగులు జర్నలిస్టులకు వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాలులో వివిధ పరీక్షలు చేయించుకోవటానికి వచ్చే వారికి నిరాశే ఎదురవుతోంది. డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలకు సంబంధించిన పరీక్షలకు కూడా అవకాశం లేకపోగా, చివరి లివర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులకు అవసరమైన పరీక్షలు కూడా జరగకపోవడం గమనార్హం. చివరి మూడు నెలలకి ఒకసారి నిర్వహించే షుగర్ పరీక్ష (హెచ్ బి ఏ వన్ సి) కూడా జరగటంలేదు.
previous post
next post