ఐశ్వర్యారాయ్… పాపం అత్తగారు, ఆడపడుచు వేధింపులు తాళలేక రోడ్డెక్కింది. నిరాహార దీక్ష చేసింది. నిరసన వ్యక్తం చేసింది. చివరకు పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతో అత్తగారి ఇంటిలోకి అడుగుపెట్టింది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఈ ఐశ్వర్యారాయ్. తన భర్త తేజ్ ప్రతాప్ యాదవ్ తో తనను కలవకుండా చేస్తున్నారని అత్తగారైన రబ్డీదేవి, ఆడపడుచు అయిన మీసాభారతిలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నది ఐశ్వర్యారాయ్. గత మూడు నెలలుగా తనకు భోజనం పెట్టడం లేదని, తాను తన పుట్టింటి నుంచి తెచ్చుకుని తింటున్నానని ఆమె చెబుతున్నది. అసలు విషయం ఏమిటంటే ఐశ్వర్యారాయ్ కి ఆమె భర్త కు చాలా కాలంగా విభేదాలు తలెత్తాయి. ఆరు నెలల కిందట తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకులకు దరఖాస్తు చేశాడు. అయితే ఇంకా ఆ కేసు పెండింగ్ లోనే ఉంది. కేసు పెండింగ్ లో ఉండగా తాను ఆ ఇల్లు విడిచి వెళ్లనని ఐశ్వర్యారాయ్ అంటున్నది. అయితే అత్త మాజీ ముఖ్యమంత్రి రబ్డీదేవి మాత్రం ఐశ్వర్యారాయ్ ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. దీనికి ఆడపడుచు, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి సహాయం చేసింది. దాంతో ధర్నాకు దిగిన ఐశ్వర్యారాయ్ కి ఆమె తండ్రి మాజీ మంత్రి చంద్రికారాయ్ బాసటగా నిలిచారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని విషయాన్ని డిజిపికి చెప్పడంతో ఆయన మాజీ ముఖ్యమంత్రి రబ్డీదేవికి నచ్చచెప్పారు. ఐశ్వర్యారాయ్ ని ఇంటిలోకి తీసుకువెళ్లే విధంగా ఒప్పించారు
previous post
next post