వనపర్తి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఫిర్యాదుదారుల నుండి సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను తీర్చేందుకు ధరణిలో అర్ఓఅర్ చట్టం ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అందుకు స్పందిస్తూ ఆయన ఆయా డిపార్ట్మెంట్ అధికారులకు ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్.నెట్