30.7 C
Hyderabad
April 19, 2024 10: 31 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో కోరలు చాచిన కబ్జా “కార్” లు..?

#landgarbing

కొల్లాపూర్ లో కొందరు విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ మధ్యనే కొల్లాపూర్ మున్సిపాలిటీలో అమాయక ప్రజలతో ప్రజాప్రతినిధులు, వారి భర్తలు ముడుపులు తీసుకుని అడ్డదారిలో పట్టాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల దృష్టికి పోవడంతో వాటిని కూల్చివేశారు. అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ భర్త తప్పు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేశారు.ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి పోయింది.అధికారులు స్పందించడంతో అక్రమ నిర్మాణాన్ని స్వయంగా వారే కూల్చివేసుకునే పరిస్థితి వచ్చింది.

సర్వే నెంబర్ 261లో ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను

కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని (హైదరాబాద్ రోడ్డు) మూలాగు స్మశాన వాటిక దగ్గర సర్వేనెంబర్ 261లో ఓ డిపార్ట్మెంట్ కు అధికారులు ఒక ఎకరా ఇరవై గుంటల స్థలాని కేటాయించారు. ఆ స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది. కోట్ల విలువ చేసే స్థలం పై దుర్మార్గులు కన్నేశారు. కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మాటలు వినిపిస్తున్నాయి.అక్కడ మాదాసి, మా దారి కురువ కుల సంఘాల భవనాలకు పాలకులు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా యాదవుల కుల సంఘాల భవనానికి గతంలో2018 అప్పటి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శిలాఫలకం కూడా వేశారు.అప్పుడే ఎన్నికలు జరిగాయి.పాలకులు మారి నాలుగేండ్లు కావడానికి వస్తుంది.ఇంతవరకు నిర్మాణాలు మాత్రం జరగలేదు.ఇప్పుడు అక్కడ భూమి కోట్లలో పలుకుతుంది. ఆ కోట్ల విలువ చేసే ప్రాంతాని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మాటలు వినిపిస్తున్నాయి.అక్కడ తప్పుడు డాక్యుమెంట్ లను కొందరు క్రియేట్ చేస్తునట్లు ప్రచారం జరుగుతుంది.వారి కనుసైగలోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారని,చట్టాలకు రక్షించే అధికారి కూడా వీరికి తోడు అయ్యారని అంటున్నారు.అక్కడ కొన్ని ప్లాట్ల (సివిల్ మ్యాటర్) పంచాయితీలో ఇన్వాల్వ్మెంట్ అయినట్లు తెలిసింది.

రెవెన్యూ,మున్సిపల్ అధికారులు చొరవతీసుకోవాలి

సర్వేనెంబర్ 261 ప్రభుత్వ స్థలంపై అధికారులు దృష్టి పెట్టాలనీ స్థానిక ప్రజలు అంటున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చొరవతీసుకోవాలని అంటున్నారు.అదే విధంగా రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించాలని అంటున్నారు. ఆ స్థలానికి రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.ఈ విషయం పై స్థానిక తాహాసిల్దార్ రమేష్ నాయక్ స్పందించారు.వివరాలు పూర్తిగా తెలుసుకుంటమని సత్యం న్యూస్ కు చెప్పారు.ఖబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts

క్రైం కంట్రోల్: తమిళనాడు సరిహద్దుల్లో కార్డన్ సెర్చ్

Satyam NEWS

భక్తుల కోసం ప్రత్యేక లింక్

Murali Krishna

మదర్ సేవ సమితి యూత్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం

Satyam NEWS

Leave a Comment