27.7 C
Hyderabad
March 29, 2024 04: 27 AM
Slider కడప

భూ ఆక్ర‌మ‌ణ‌లపై అధికారుల చోద్యం

Ration Kadapa

కడప నగరంలోని హరి టవర్స్ లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ విలేఖ‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. అధికారుల అండదండలతో యధేచ్ఛగా భూ అక్రమణలకు అధికార పార్టీ నేత‌లు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. జిల్లాలో ప్రభుత్వ, పేదల భూములను కబ్జాదారులు అక్రమిస్తుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భూఆక్రమణల పై రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నా ప‌ట్ట‌న‌ట్లు ఉండ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు.

భూ ఆక్రమణలు వాస్తవమేనని స్వయంగా జిల్లా కలెక్టరే ప్రకటించారంటే భూ కబ్జాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమవుతుంది. సంబందిత రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పడం అభినందనీయం.

అయితే సిబ్బందిపై మాత్రమే చర్యలు తీసుకోవడం సరైనది కాదు. భూఆక్రమణదారులకు, సహకరించిన అధికారులను శిక్షిస్తే తప్ప భూ ఆక్రమణలు ఆగవు. అధికారులను శిక్షించినప్పుడే ప్రభుత్వ, పేదల భూములు కాపాడిన వారవుతార‌ని హ‌రిప్ర‌సాద్ పేర్కొన్నారు.

కరోనా కష్ట కాలంలో రేషన్ ధరలు పెంచి భారం మోపడం సమంజసం కాదు. సీఎం సహాయ నిధి కింద పేదల ఆరోగ్యానికి అందించే ఆర్థిక సాయం రద్దు చేయడం దుర్మార్గపు చర్య, దీన్ని బట్టి చూస్తే జగన్ ప్రభుత్వానికి పేదల పట్ల ప్రేమాభిమానాలు లేవని తేటతెల్లమైంద‌ని దీన్ని బ‌ట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం దోచుకునే పార్టీ అని స్ప‌ష్టం అవుతోంద‌ని హ‌రిప్ర‌సాద్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Related posts

ఏపీలో 22 మంది ఆర్ఐలకు డీఎస్పీ లగా పదోన్నతి….!

Satyam NEWS

వామపక్షల పోరాట ఫలితమే రైతు రుణమాఫీ

Bhavani

కాణిపాకం ఆలయంలో విలువైన నగ మయం

Bhavani

Leave a Comment