39.2 C
Hyderabad
April 25, 2024 18: 53 PM
Slider విజయనగరం

గత కాలపు భూ సమస్యల పరిష్కారానికే రీ- సర్వే

#CollectorVijayanagaram

వై.ఎస్.ఆర్. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పధకం  క్రింద జరుపుతున్న రీ సర్వే తో భూముల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ డా. ఎం. హరిజవహర్ లాల్ తెలిపారు.

సీసీ ఎల్ ఎ  మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్, రెవిన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ  ఉషా రాణి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమీషనర్ సిద్ధార్ధ జైన్ తదితర ఉన్నతాధికారులు… రీ సర్వే, రెవిన్యూ రికార్డు ల శుద్ధీకరణ  పై జిల్లా కలెక్టర్ల తో  వీడియో  కాన్ఫరెన్స్ నిర్వహింఛి పలు సూచనలను జారి చేసారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్  అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ   ఫిబ్రవరి 7 నుండి ఎంపిక చేసిన గ్రమాల్లో రీ సర్వే కార్యక్రమం ప్రారంభం అవుతుందని అన్నారు.   ఒక్కో రెవిన్యూ డివిజిన్ నుండి ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి సమగ్రంగా సర్వే చేసి వచ్చిన ఫలితాలను బట్టి  వాస్తవ పరిస్థితుల్ని, సందేహాల్ని మదింపు చేసుకొని ఎఫ్.ఎ.క్యు లను తాయారు చేసుకొని   తదుపరి సర్వే నిర్వహిస్తామన్నారు.

విజయనగరం డివిజిన్ నుండి బొండపల్లి మండలం తమటాడ , పార్వతీపురం డివిజిన్ నుండి రామభద్రపురం మండలం మర్రివలస గ్రామాల్లో ఈ పైలట్ సర్వే జరుగుతుందన్నారు.  అందుకోసం అవసరమగు మెటీరియల్ అంత వచ్చిందని, శిక్షణలు కూడా పూర్తి చేసుకొని సర్వే కు సిద్ధం కావడం జరుగుతుందన్నారు.

విజయనగరం కలెక్టరేట్ నుండి సంయుక్త కలెక్టర్ (రెవిన్యూ) డా. జి.సి.కిషోర్ కుమార్, సర్వే శాఖ సహాయ సంచాలకులు పోలా రాజు,  కే.ఆర్.ఆర్.సి ఉప కలెక్టర్ బాలాత్రిపుర  సుందరి , సర్వే శాఖ సిబ్బంది ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Related posts

బలవంతపు హిందీపై మోడీ వివరణ

Satyam NEWS

NTR: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మూడక్షరాలు

Satyam NEWS

ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపిన ‘రైతు సంకెళ్లు’

Satyam NEWS

Leave a Comment