24.7 C
Hyderabad
March 29, 2024 08: 02 AM
Slider శ్రీకాకుళం

భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టుకి భూములు ఇవ్వలేం

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం లోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు పునరావాస కాలనీకి భూములు ఇవ్వలేమని రైతులు తేల్చి చెప్పారు. సంతబొమ్మాలి మండలం నౌపడ గ్రామ సచివాలయంలో సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రైతులతో గ్రామసభ నిర్వహించారు. తరతరాలుగా ఈ భూములు నమ్ముకుని పిల్లలను చదివిస్తున్నామని, జీవనోపాధి పొందుతున్నమని అన్నారు. ఈప్రాంతంలో పోర్టు పునరావాస కాలనీ నిర్మించాలన్న ఆలోచనను విరమించుకోవాలని నౌపడ రైతులు డిమాండ్ చేశారు. రహదారి నిర్మాణానికి అయితే భూములు ఇస్తాం తప్ప పునరావాస కాలనీకి ఇవ్వలేమని 84 మంది రైతులు తేల్చి చెప్పారు. పునరావాస కాలనీకి భూములు ఇస్తే కూలీలుగా మారిపోతామని నౌపడ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అభిప్రాయం తీసుకోకుండా మెండిగా ప్రభుత్వం ముందుకెళ్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రైతులు స్పష్టం చేశారు.

Related posts

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Satyam NEWS

ఓటు నమోదుకు 19వరకు గడువు

Bhavani

సంస్కృత కళాశాలలో “వేదవ్యాస సదనం” నిర్మాణానికి జీ హెచ్ వి చేయూత

Satyam NEWS

Leave a Comment