30.7 C
Hyderabad
April 24, 2024 02: 42 AM
Slider విశాఖపట్నం

రాష్ట్రంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్

రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతోందని, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. కేంద్రం పన్నుల ఆదాయానికి భారీ ఎత్తున గండి పడింది కనుక విచారణ చెయ్యమని రాష్ట్ర బీజేపీ తరపున కేంద్రాన్ని కోరతామని ఆయన తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని కొందరు పెద్దలపై ఆరోపణలు చెలరేగుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కామెంట్లు సంచలనంగా మారాయి. ఏప్రిల్ నుంచి ముఖ్యమంత్రి విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని ప్రచారం జరుగుతోందని అయితే బీజేపీ మాత్రం విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను అంగీకరించేది లేదని ఆయన తెలిపారు.

నరసాపురం సభకు వచ్చిన మహిళలతో చున్నీలు తీయించి వెయ్యడం సిగ్గుచేటని ఆయన అన్నారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ అనవసరంగా విరుచుకుపడుతున్న వాసిరెడ్డి పద్మకు నరసాపురంలో జరిగిన దారుణం కనిపించ లేదా…? అని ఆయన ప్రశ్నించారు.

Related posts

Special Story: విశాఖ పోర్ట్ పైనా కరోనా ప్రభావం

Satyam NEWS

తప్పు మీద తప్పు: చివరికి మిగిలేదేమిటి?

Satyam NEWS

కరోనా సేవలకు మహబూబ్ బాషా కు సేవారత్నం అవార్డు

Satyam NEWS

Leave a Comment