Slider ప్రత్యేకం ముఖ్యంశాలు

సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు

sushma swaraj

గుండె పోటుతో మరణించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమె మృతి తీరని లోటు అని చెప్పారు. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఉంచనున్నట్లు చెప్పారు. ఈరోజు సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. సుష్మకు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే  కుటుంబ సభ్యులు ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్‌ వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అనారోగ్య కారణాలతో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.

Related posts

కరోన వైరస్ సెకండ్ వేవ్..ప్లీజ్ బీ కేర్ ఫుల్..! -రేంజ్ డీఐజీ హెచ్చరిక..!

Satyam NEWS

రివార్డ్:కరోనా వైరస్‌ ను కంట్రోల్ చేస్తే కోటి బహుమతి

Satyam NEWS

ప్రపంచ కార్మిక దినోత్సవం విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment