27.7 C
Hyderabad
April 20, 2024 02: 18 AM
Slider జాతీయం

ఆర్టికల్ 370 ఎఫెక్ట్: మంచు కొండల్లో తగ్గిన హింస

asha_211119_reddycng

జమ్మూ కాశ్మీర్ లడ్డక్ ప్రాంతాలలో హింసాయుత సంఘటలను పూర్తిగా తగ్గిపోయాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి లోక్‌సభకు తెలిపారు. జమ్ము కాశ్మీర్‌లో శాంతి భద్రతలు కాపాడడం కోసం వేర్పాటువాదులు, కొంతమంది రాజకీయ నేతల్ని నిర్భందంలో ఉంచినట్లు ఆయన చెప్పారు.

రెగ్యులర్‌గా అక్కడి పరిస్థితిపై సమీక్ష జరుపుతున్నామని, స్థానిక అధికారులు వారిని ఎప్పుడు రిలీజ్ చేయొచ్చంటే అప్పుడు బయటకు వదులుతామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కాశ్మీర్, లఢక్‌లు కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాక హింసాత్మక ఘటనలు తగ్గడం శుభ సూచకమని అన్నారు.

1990 నుంచి ఈ ఏడాది డిసెంబరు 1 వరకు 22,557 మంది టెర్రరిస్టుల్ని మన ఆర్మీ మట్టుబెట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. పాక్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి 2005 నుంచి ఇప్పటి వరకు 1011 మంది ముష్కరులు జవాన్ల చేతిలో హతమయ్యారని చెప్పారు.

Related posts

విత్ లాక్ డౌన్ రూల్స్: ‘వల్లూరిపల్లి’వారి వివాహ నిశ్చితార్థం

Satyam NEWS

హోలీ డిప్:వారణాసిలో మౌనిఅమావాస్య పుణ్యస్నానాలు

Satyam NEWS

గాజుల అలంకారంలో బెజవాడ దుర్గమ్మ

Sub Editor

Leave a Comment