విజయవాడలో ఫిటీజీ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా 10 వ తరగతి విద్యార్థులు కు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకుంటున్న AP 24X7 మహిళా జర్నలిస్టుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ ప్రజా సంక్షేమ సమితి అధ్యక్షుడు కరుణాకర్ ప్రేమల డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టు అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించిన వారి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మొన్న ఆంధ్రజ్యోతి విలేకరి హత్య,ఈ రోజు ఈ సంఘటన ప్రమాదకర పరిస్థితులను సూచిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల కోసం ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల పై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులను,హత్య కాండలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
previous post
next post