సి.ఏ.ఏ,యన్.ఆర్.సి, ఎన్ సి పి లకు వ్యతిరేకంగా రాజంపేట పట్టణంలో జరుగుతున్న రిలే నిరహార దీక్షలకు సోమవారం రాజంపేట లాయర్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్ కుమార్ రాజు సంఘీభావం ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలో లాయర్లు వచ్చి రిలే నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు.
నిర్వహకులు జె.ఏ.సి కన్వీనర్ గండికోట గుల్జార్ బాష ని రిలే దీక్షలో కూర్చున్న వారిని లాయర్లు అభినందించారు. వెంటనే సి.ఏ.ఏ,యన్.ఆర్.సి బిల్లును రద్దు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.