39.2 C
Hyderabad
March 29, 2024 15: 17 PM
Slider విజయనగరం

స‌ర్వం ల‌యాధీనం….ల‌య ప్ర‌జ్ఙ వాద్య శిక్ష‌ణా కేంద్రం…! ఎక్క‌డంటే..?

#MusicCenter

మీరు  సంగీతంలో దిట్టా..?  మీరు మృదంగం నేర్చుకుంటున్నారా…?  లేక వ‌యోలినా..? అదీ గాక వీణ‌….?  వీట‌న్నింటిలో ఏదో ఒక‌టి నేర్చుకున్నా మీరు స‌రిగ్గా రాణించ‌లేక పోతున్నారా..? అదీ కాకుండా సంబంధిత  వాటిలో నేర్చుకున్న మీకు ఇంకా శృతి త‌ప్పుతోందా..?

అయితే వీటన్నింటికీ చ‌క్క‌గా ప్రాక్టిక‌ల్ గా స‌మాధానం చెప్పేందుకు క‌ళ‌ల‌కు కాణాచి అయిన విజ‌య‌న‌గరంలో కొత్త‌గా వెలసిందో.. వాద్య శిక్ష‌ణా కేంద్రం.స‌ర్వం ల‌యాధీనం అన్న క్యాప్ష‌న్ తో…న‌గ‌రంలోని కొత్త పేట మండ‌పం  వ‌ద్ద బుక్కావారి వీధిలో ల‌య ప్ర‌జ్ఙ వాద్య శిక్ష‌ణా కేంద్రం అనే పాఠ‌శాల ఏర్పాటు చేసారు..న‌గ‌రంలో ప్ర‌ముఖ సంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ధ‌వ‌ళ స‌ర్వేశ్వ‌ర‌రావు.

ఇప్ప‌టికే మూడు సంస్థ‌ల‌కు వ్య‌వ‌స్థాప‌క అద్య‌క్షులుగా ఉన్న ధ‌వ‌ళ స‌ర్వేశ్వ‌ర‌రావు…ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ సోసైటీ కార్య‌ద‌ర్శి డా.మండ‌పాక ర‌వి ప్రిన్సిపాల్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ శిక్ష‌ణా కేంద్రంలో… అన్ని వ‌య‌స్సుల వారికి వారి అభీష్టం కోరిక‌ల మీర‌కు మృదంగం,డోలు,కంజీరా,త‌బాల వంటి వాద్యాల‌పై శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

ఆస‌క్తి గ‌ల నేర్చుకో ద‌ల‌చిన వారు తమ‌,త‌మ ఇష్టాను సారంగా మాత్ర‌మే ఫీజును ఇవ్వొచ్చ‌ని…కార్య‌ద‌ర్శి మండ‌పాక ర‌వి తెలిపారు. సంగీతం అభిరుచి ఉన్న పెద్ద‌లు..ఒక‌రు….దాదాపు 250 గంజాలున్న స్థ‌లాన్ని..కేవ‌లం సంగీతం కొర‌కు వాయిద్య శిక్ష‌ణాల‌యం కొర‌కు దానంగా ఇచ్చార‌ని పేర్కొన్నారు.

వారి కోరిక మేర‌కు..ధ‌వ‌ళ స‌ర్వే|శ్వ‌ర‌రావు విజ్ఙ‌ప్తి మేర‌కు…స‌ర్వం ల‌యాధీనం అన్న ట్యాగ్ లైన్ తో….ల‌య ప్ర‌జ్ఙ వాద్య శిక్ష‌ణా కేంద్రాన్నిస్థాపించామ‌ని…మండ‌పాక ర‌వి… ఈ సంద‌ర్భంగా మ‌ఠం వీధి వేణుగోపాల‌స్వామి ఆల‌యంలో తెలిపారు.

Related posts

వనపర్తి అభివృద్ది చూసి ఆనందపడుతున్నా: మంత్రి హరీష్ రావు

Satyam NEWS

కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి

Bhavani

నరసరావుపేట లో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పర్యటన

Satyam NEWS

Leave a Comment