పౌల్ట్రీ రైతుల నిరసన సెగ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు తగిలింది. హైదరాబాద్ లోని హెచ్ఐసిసి ఎగ్జిబిషన్ లో జరుగుతున్న పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. విపరీతమైన నష్టాలతో చిన్న స్థాయి పౌల్ట్రీ యజమానులు నష్టాల పాలవుతున్నారని పౌల్ట్రీ రైతులు ఆరోపించారు. లేయర్ కోళ్ల రైతులకు వస్తున్న సబ్సిడీలను బ్రీడర్లు, ఫీడ్ కంపెనీలు తన్నుకు పోతున్నారని వారు ఆరోపించారు.
లేయర్ ఫార్మర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేయర్ పౌల్ట్రీ రైతుల సమస్యలను నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్ పర్సన్ అనురాధా దేశాయ్ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. లేయర్ పౌల్ట్రీ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే ఎగ్ బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి తలసాని ఎదుటే ఈ నినాదాలు చేయడంతో ఆయన ఆగి వారి సమస్యలు విన్నారు.