27.7 C
Hyderabad
March 29, 2024 03: 15 AM
Slider మహబూబ్ నగర్

అతిధి అధ్యాపకుడి ని హత్య చేసిన ప్రభుత్వం

#talakondapalli

బంగారు తెలంగాణ అంటూ చెప్పుకునే టిఆర్ఎస్ ప్రభుత్వమే అతిధి అధ్యాపకున్ని హత్య చేసిందని తలకొండపల్లి జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వెల్దండ మండలం బొల్లంపల్లిలో గణేష్ ఆచారి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృత దేహానికి పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేశా చారి ఆత్మహత్యను ప్రభుత్వ హత్య గా పరిగణించాలన్నారు.

ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ కళాశాలలో బోటనీ లెక్చరర్ గా పనిచేస్తు జీవితం గడుపుతున్న గత పదహారు నెలల నుండి జీతం రాక  బతుకు జీవుడా అంటూ జీవితం కొనసాగించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1650 మంది అతిధి అధ్యాపకులు ఉన్నారని ఇప్పటికైనా వారి సేవలు స్వీకరించి వారికి జీతభత్యాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరో అధ్యాపకుడు బలిదానం కాకముందే తగిన నిర్ణయం తీసుకోవాలని లేకుంటే రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీకి సరస్వతీపుత్రల  శాపం తగిలి వినాశనం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రావడానికి  తొలి ఆత్మ బలిదానం శ్రీకాంతాచారి అయితే అతిధి అధ్యాపకుల బలిదానం లో మొదటిది గణేషాచారి అని ఇలా ఎంత మందిని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటుందని దుమ్మెత్తిపోశారు.

మృతిని కుటుంబాన్ని ఆదుకోవాలని 25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన కుటుంబానికి ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని అర్థాంతరంగా ఆగిపోయిన ఇల్లు నిర్మాణానికి ఆర్థికంగా ఆదుకుంటామని ఉప్పల వెంకటేష్ హామీ ఇచ్చారు.

Related posts

రేప్ నిందితులపై కెమికల్ కాస్ట్రేషన్ పనిష్‌మెంట్ : పాకిస్తాన్

Sub Editor

తిరుమల ప్రత్యేక దర్శనం టిక్కెట్ స్కీమ్ రేపు ప్రారంభం

Satyam NEWS

తిరుపతి పవిత్రతకు “విఘాతం” కలిగించకండి

Satyam NEWS

Leave a Comment