27.7 C
Hyderabad
March 29, 2024 02: 24 AM
Slider రంగారెడ్డి

లియోనియా కార్మికులకు అండగా ఉంటా

#RaghunandanRaoMLA

ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడి తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నలియో మెరిడియన్‌ రిసార్ట్‌ కార్మీకులకు అండగా ఉంటామని బిజెపి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు భరోసానిచ్చారు.

శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్‌లో శుక్రవారం లియో మెరిడియన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావెవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునంధన్‌రావు మాట్లాడుతూ… యాజమాన్యం తప్పిదాలు, దుర్వినియోగం వల్ల లియో మెరిడియన్‌ రిసార్ట్‌ సమస్య నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు చేరిందన్నారు.

దాదాపు 15 వందల మంది కార్మికులు పనిచెసె రిసార్ట్‌ ఎక్కువ భాగం మూసివేయడంతో 13 వందల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి, రెండు వందల మంది కార్మికులు దిక్కులెని స్థితిలో 30 శాతం జీతానికి పనిచేస్తున్నారన్నారు.

 ప్రస్తుతం లియో మెరిడియన్‌ రిసార్ట్‌ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసిన ఆర్‌.పి మధ్యవర్తిత్వం కమిటి స్వాదీనంలో ఉందని, సంక్షోభం వల్ల కార్మికులు ఉపాధి కరువై కార్మిక కుటుంబాలు అర్దాకలితో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ఆర్‌.పి మధ్యవర్తిత్వం కమిటీ సభ్యులు డిల్లీలో ఉండడం వల్ల కార్మికులకు రావాల్సిన జీతం బకాయిలు, రవాణా, వసతి సౌకర్యాలు, జీతాలు పెంచాలని కోరేందుకు కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, వారి వెదనలు వినెవారు కరువయ్యారని ఆయన పేర్కొన్నారు.

ఆర్‌.పి మధ్యవర్తిత్వం కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం కొంత మెరకు పాక్షికంగా నడుస్తున్న లియో మెరిడియన్‌ రిసార్ట్‌ పూర్తి స్తాయిలో ప్రారంభించి మొత్తం 1500 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని సుప్రీమ్‌ కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆర్‌.పి మధ్యవర్తిత్వ కమిటీని ఆయన కోరారు.

పర్యాటక పరిశ్రమగా ఉన్న లియో మెరిడియన్‌ రిసార్ట్‌ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చెసుకొని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అసంఘటిత కార్మికులుగా ఉన్న లియో మెరిడియన్‌ రిసార్ట్‌ కార్మికుల సమస్యలను ఆర్‌.పి మధ్యవర్తిత్వం కమిటీ దృష్టికి తీసుకెళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తానని రఘునందన్‌రావు హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో లియో మెరిడియన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రదాన కార్యదర్శి అనంత లంక, వెంకట్‌ లు పాల్గొన్నారు.

Related posts

కోట్లకు పగడలెత్తిన మాజీ ఆప్కో చైర్మన్

Satyam NEWS

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Satyam NEWS

సీఎం ప్రకటనపై అంబర్ పేట్ టీఅర్ఎస్ నాయకుల సంబరాలు

Satyam NEWS

Leave a Comment