38.2 C
Hyderabad
April 25, 2024 11: 00 AM
Slider కరీంనగర్

కంటి వెలుగును కలిసి విజయవంతం చేద్దాం

#success together

గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్ష జరిగేలా గ్రామ సర్పంచ్, అధికారులు బాధ్యత తీసుకోవాలి. కంటి వెలుగు క్యాంప్ జరిగే రోజు పంచాయతీ సిబ్బంది అంతా అక్కడే ఉండి ఏర్పాట్లు చూడాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నుంచి ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన నిర్వహించిన కంటి వెలుగు -2 రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్నారు.

గ్రామాల్లో కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో కంటి వెలుగు అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని పెట్టారని మంత్రి అన్నారు. మొదటి కంటి వెలుగు కార్యక్రమం చాలా విజయవంతం అయ్యిందని అలాగే రెండవ విడత దానిని మించి విజయవంతం చేసేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, అధికారులు, డి.ఆర్. డి. ఏ విభాగం వాళ్ళు కలిసి పాల్గొని కంటి వెలుగు క్యాంప్ విజయవంతం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Related posts

కరోనా పరీక్షల కోసం ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు

Satyam NEWS

క్రాస్ రోడ్డ్: కాంప్రమైజ్ అయితే జూపల్లి ఖేల్ ఖతం

Satyam NEWS

కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి

Satyam NEWS

Leave a Comment