37.2 C
Hyderabad
March 28, 2024 20: 24 PM
Slider ప్రపంచం

పాకిస్తాన్ కు అమెరికా భారత్ సంయుక్త గ్రూప్ హెచ్చరిక

#Pathankot

పఠాన్ కోట్ నిందితులపై తక్షణమే కేసు నమోదు చేయాలని భారత్, అమెరికాకు చెందిన అధికారుల బృందం పాకిస్తాన్ ను హెచ్చరించింది. ఇప్పటికే చాలా ఆలశ్యమైనందున తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

అమెరికా భారత్ మధ్య జరిగిన ఏడవ ఉగ్రవాద వ్యతిరేక సంయుక్త వర్కింగ్ గ్రూప్ సమావేశం అనంతరం పాకిస్తాన్ కు ఈ హెచ్చరిక పంపారు.

ముంబయి దాడులకు సంబంధించిన వారిపై కూడా ఇప్పటి వరకూ చర్యలు తీసుకోకపోవడం సహించరాని విషయమని వారు పాకిస్తాన్ కు తెలిపారు.

ఏ దేశ భూభాగం కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోరాదని, అలా వాడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్కింగ్ గ్రూప్ తెలిపింది.

గత ఏడాది జరిగిన సమావేశం తర్వాత కూడా ఈ వర్కింగ్ గ్రూప్ ఇలాంటి లేఖనే విడుదల చేసింది. అయితే పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Related posts

న్యూ మ్యాంగ్ కుంఫు విద్యార్థులకు రాష్ట్ర మంత్రి ప్రశం

Satyam NEWS

గుర్రపు డెక్కను తొలగించి ఉదయగిరి వాసులను కాపాడండి

Bhavani

ప్రశ్నాపత్రాలతో దందా చేస్తున్న ప్రభుత్వం: టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం

Satyam NEWS

Leave a Comment