33.2 C
Hyderabad
April 26, 2024 02: 08 AM
Slider శ్రీకాకుళం

జీతాలు రాక జీవితాలు దుర్భరం

#Hindi Language Scholars

2019 జూలై నెలలో నియమితులైన 39 మంది హిందీ భాషా పండితులకు 42 నెలలుగా జీతాలు అందక తీవ్ర దుర్భర స్థితిలో ఉన్నారు. జీతాల కోసం జిల్లా అధికారుల నుండి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల వరకు కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటికీ వారికి మోక్షం కలగడం లేదు. జీతాలు అందక దుర్భర జీవితం గడుపుతున్న ఇద్దరు మరణించారు. ఈ సంవత్సరం సంక్రాంతి అయినా ఆనందంగా జరుపుకుంటామో లేదో అని ఆవేదన చెందుతున్నారు.

ఈ విషయమై ప్రస్తుతం ఈ దస్త్రం సీఎంఓ కార్యాలయం దగ్గర ఉన్నందున మరొకసారి రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖ రాయమని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 39 మంది హిందీ భాషా పండితులు జిల్లా విద్యాశాఖ అధికారి గార పగడాలమ్మ ని కలిసి విన్నవించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిసిని వసంతరావు కూన రంగనాయకులు గొడబ మేరీ ప్రసాద్ కుప్పన్నగారి శ్రీనివాసరావు చింతపల్లి వెంకటరమణమూర్తి బలివాడ మంజుల, మున్నేసా బేగం తదితరులు ఉన్నారు.

Related posts

ఆస్ట్రేలియా టైటాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ పెస్టివ‌ల్‌లో ‘దహిణి’

Bhavani

మునిసిపల్ సిబ్బందికి ఆర్ఎంపిల సహకారం

Satyam NEWS

మా డబ్బులతో మాకు పాల ప్యాకెట్లు ఇస్తే సరిపోతుందా?

Satyam NEWS

Leave a Comment