28.6 C
Hyderabad
September 20, 2020 12: 17 PM
Slider సంపాదకీయం

కరోనా మందు బ్లాక్ లో అమ్మే వీళ్లు మనుషులేనా?

#CoronaDrug

ఈ మాయదారి కరోనా ఎప్పుడు తగ్గుతుందో కానీ అప్పటి వరకూ ప్రాణాలు నిలిచేలా కనిపించడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా బ్లాక్ మార్కెట్ దందాలకు కొదవ లేకుండా పోతున్నది. కరోనా ట్రీట్ మెంట్ కు కచ్చితమైన మందు ఇప్పటి వరకూ లేదు.

అందువల్ల సందర్భాన్ని బట్టి మందులు వాడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు వాడుతున్న రెమిడిస్వేర్ మందు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. రెమిడిస్వేర్ మందు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న వారిని హైదరాబాద్ పోలీసులు పట్టుకుంటున్నారు కూడా.

ఐదు రూపాయల మందును 40 నుంచి 50 వేల రూపాయలకు అమ్ముతున్నారు. అదే విధంగా ఇప్పుడు సిప్లా కంపెనీకి చెందిన యాక్టిమ్రా అనే మందు పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఒక్కో ఇంజెక్షన్ లక్ష రూపాయల వరకూ అమ్ముతున్నారు.

టోసిలిజుమాబ్ మందు ఉండే ఈ యాక్టమ్రా ఇంజెక్షన్ ట్యుబర్కొలోసిస్ కు వాడతారు. ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఏర్పడినప్పుడు వాడే ఈ మందు కరోనా తో సీరియస్ గా ఉన్న రోగుల్లో పని చేస్తున్నట్లుగా కొందరు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

పిల్లల్లో పెద్ద వారిలో రుమటైడ్ ఆర్ధ్రరైటిస్ లో కూడా ఈ మందు ఉపయోగపడుతుంది. ఈ మందు రక్తంలో అతి తక్కువ ఆక్సిజన్ ఉండే స్థితిలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు డాక్టర్లు భావిస్తున్నందున దీన్ని శ్వాస అందక ఇబ్బంది పడుతున్న కరోనా రోగులకు ఇస్తున్నారు.

ఇది కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సిన మందు. విపరీతమైన ఆరోగ్య సమస్యలు తెచ్చే ఈ మందును కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. అందువల్ల దీన్ని తక్కువ పరిమాణంలోనే తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా రోగులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నందున ఈ మందు ప్రొడక్షన్ పెరగనందున డిమాండ్ అమాంతంగా ఎక్కువ అయింది.

కరోనా రోగులకు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి రోగికి మూడు నుంచి నాలుగు డోసులు (60 ఎంఎల్) ఇస్తున్నారు. దాంతో ఈ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోతున్నది. అవసరం అయిన రోగులకు వాడేందుకు ప్రిస్క్రిప్షన్ లో రాసి ఇచ్చి తెచ్చుకోమని డాక్టర్లు చెబుతున్నారు.

ఇది మందుల షాపుల్లో అమ్మే మందు కాదు. అందువల్ల ఎక్కడా దొరకదు. ఎక్కడా దొరకలేదు కదా మేం ప్రత్యేకంగా తెప్పించాము దాన్ని వాడతాము ఇంజెక్షన్ కు లక్ష రూపాయలు అవుతుంది అని ఆసుపత్రులు చెబుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగి తరపు వారు అంగీకరిస్తే లక్ష రూపాయలకు ఒక ఇంజెక్షన్ చేస్తున్నారు.

రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు కూడా రెస్పాండ్ అయ్యే లక్షణం ఉండటంతో ఈ మందు బాగా పని చేస్తున్నట్లు కొందరు డాక్టర్లు గమనించారు. సీరియస్ గా ఉన్న కోవిడ్ రోగులకు వాడే ఈ ఇంజక్షన్ బ్లాక్ లో అమరుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ మందును రెగ్యులేట్ చేసి అవసరమైన వారికి డాక్టర్ల ద్వారా అందించే ప్రయత్నాలు చేయడం లేదు.

అత్యవసరమైన ఈ మందు విషయంలో ప్రభుత్వం కంట్రోల్ లేకపోవడంతో బ్లాక్ మార్కెటీర్లు విజృంభించి సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా పేషంట్ల చావుపై న డబ్బులు ఏరుకుంటున్నారు.

Related posts

వార్ సిట్యుయేషన్: కాశ్మీర్ ను తలపిస్తున్న అమరావతి

Satyam NEWS

క్రాలింగ్: కేసీఆర్ సారంటే దేవునితో సమానం

Satyam NEWS

నిరుపేదకు వైద్య సాయం చేసిన కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!