27.7 C
Hyderabad
March 29, 2024 01: 30 AM
Slider నెల్లూరు

అమానవీయంగా జరుగుతున్న అంతిమసంస్కారం

#Corona dead bodies

కరోనాతో మరణించిన వారి భౌతిక కాయాన్ని ఏం చేయాలి? దీనికి సంబంధించిన ప్రోటోకాల్ ఉందో లేదో తెలియదు కానీ దేశంలో పలు చోట్ల కరోనాతో చనిపోయిన వారిని దారుణం పరిస్థితుల్లో ఖననం చేస్తున్న విషయం తెలిసిందే. పెద్ద పెద్ద గుంతలు తీసి అందులో శవాలను పడేసి పూడ్చివేస్తున్న వైనం దేశంలోని చాలా చోట్ల జరుగుతున్నది.

దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. కరోనా సోకి మరణించిన వారి అంతిమ సంస్కారం ఏ విధంగా జరుగుతున్నదో చూస్తుంటే కన్నీళ్లు ఆగకమానదు.

తాజాగా నెల్లూరు ప్రాంతంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చూస్తే బాధ కలగకమానదు. నెల్లూరులో కరోనా మృతదేహాలు జేసీబీల్లో తరలిస్తున్నారు. అక్కడ నుంచి మృతదేహాలను తీసుకుని వెళ్లి పెన్నా నదిలో పెద్ద పెద్ద గుంతలు తీసి అక్కడ పడేసి జేసీబీతో పూడ్చేస్తున్నారు.

Related posts

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ పై కసరత్తు

Sub Editor

ఈ సారి హజ్ యాత్రపై కఠిన ఆంక్షలు

Satyam NEWS

పండుగలాగా కొనసాగుతున్న పల్లె ప్రగతి

Satyam NEWS

Leave a Comment