28.2 C
Hyderabad
April 20, 2024 12: 29 PM
Slider నల్గొండ

వసూళ్లకు పాల్పడిన విద్యుత్ లైన్ మెన్ సస్పెన్షన్

విద్యుత్ బిల్లులు, మీటర్ల పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూళ్లు చేసి దుర్వినియోగానికి పాల్పడిన లైన్ మెన్ ను సస్పెండ్ చేసినట్లు సూర్యాపేట జిల్లా విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామ లైన్ మెన్ రూ.78వేలు జల్మాల కుంట, ఎల్లప్పకుంట తండాల్లో వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రంలో డీడీ చెల్లించాలని సూచించారు.

పట్టణాల్లో 48గంటలు,రూరల్ లో 4 రోజుల్లో లైన్ మెన్ మీటర్లు ఫిట్ చేస్తారని చెప్పారు. ట్రాన్స్ ఫార్మర్,ఫోల్ షిఫ్టింగ్ తో పాటు ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా రూ.60 తో డీడీ కట్టి సిఎస్సిలో నమోదు చేసుకోవాలన్నారు. సిబ్బందికి కరెంట్ బిల్లులు మాత్రమే చెల్లించి వెంటనే రశీదు తీసుకోవాలని కోరారు.విద్యుత్ సమస్యలకు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు 9440813537, తుంగతుర్తి నియోజక వర్గ ప్రజలు 9440813539 నెంబర్లను సంప్రదించాలన్నారు.

Related posts

కాంట్రవర్సీ: రాజధాని మార్చేందుకు కరోనా కుట్ర

Satyam NEWS

శిల్ప కళ బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్ష ఎన్నిక

Satyam NEWS

సుప్రీంకు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన ప్రశాంత్ భూషణ్

Satyam NEWS

Leave a Comment