36.2 C
Hyderabad
April 25, 2024 21: 39 PM
Slider మహబూబ్ నగర్

భాషా పండితులు పి.ఈ.టి లకు న్యాయం చేయాలి

#P.E.T Sanghas

గత 20 సంవత్సరాలుగా భాషా పండితులు పి.ఈ.టి లు పదోన్నతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ భాషా పండితులు పి.ఈ.టి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎస్.బి హెచ్ దగ్గర ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించారు.

అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులతో పాటే భాషా పండితులు పి.ఈ.టి లకు పదోన్నతులు ఇవ్వాలని వినతి పత్రం లో పేర్కొన్నారు. సర్వీసు కాలంలో ప్రమోషన్లు రాక అదే స్థాయిలో పదవీ విరమణ చేస్తూ, ఆర్థికంగా చాలా నష్ట పోతున్నారని వారు వాపోయారు. మిగిలిన అన్ని సబ్జెక్టుల టీచర్లకు ఉన్న నియమ నిబంధనలు పండిత పి.ఈ.టి లకు ప్రభుత్వం ఎందుకు వర్తింపజేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా పండిత,పి.ఈ. టి ల డిమాండ్లపై సానుకూలంగా స్పందించి,న్యాయం చేస్తూ,వారికి పదోన్నతులు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ భాషా పండిత పి.ఈ.టి.ఐక్యవేదిక తెలుగు పండితులు గుడేలి శీనయ్య, వేముల కోటయ్య, కే.వెంకటేశ్వర్లు, నారాయణ, రాజేందర్ రెడ్డి, శ్రీదేవి, వరలక్ష్మి, అనిత హిందీ పండితులు కృష్ణ కుమారి, సలీం, పి.ఈ.టి.లు రాధా కృష్ణ, ప్రతాప్ సింగ్ పాల్గొన్నారు.

Related posts

గాన గంధ్వరుడు ఎస్ పి బి కి కరోనా పాజిటీవ్

Satyam NEWS

మా పార్టీ గూండాల దాడిని ఖండిస్తున్నా

Satyam NEWS

కొత్తగా జిల్లాలో కలిసిన పోలీసు స్టేషన్ లను తనిఖీ చేసిన విజయనగరం ఎస్పీ దీపిక

Satyam NEWS

Leave a Comment