35.2 C
Hyderabad
April 20, 2024 15: 11 PM
Slider కృష్ణ

ఉచితంగా నిత్యావసరాలు పంచిన విజయవాడ లయన్స్

#krishna dist

ప్రపంచవ్యాప్తంగా గడచిన 15 మాసాలుగా కరోనా మహమ్మారి అన్ని స్థాయిల్లో ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న నేపధ్యంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎక్కడికక్కడ తమ వంతు గా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా 53 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన విజయవాడ రూరల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లో ఎల్ ఐ సి కాలనీ లో క్రీస్తురాజపురం కు చెందిన 300 మంది పేద కుటుంబాలకు కరోనా నిబంధనలను పాటిస్తూ బుధవారం నెల రోజులకు సరిపడా కూరగాయలు, నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది.

ఇందుకోసం మూడు లక్షల రూపాయల పైగా వెచ్చించడం జరిగింది.

ముఖ్య అతిధిగా పాల్గొన్న విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్నీ చేయలేరు…. అయితే ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు, సేవాతత్పరులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని తమ వంతు సేవలు అందించాలని కోరారు.

ఈ శిబిరాన్ని ఎలక్టెడ్ గవర్నర్  దామర్ల శ్రీ శాంతి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పాలడుగు శ్రీనివాసరావు, సూర్యదేవర వేణు, కోశాధికారి లయన్స్ పూర్వ గవర్నర్ లు లింగం శివ శంకర్, తాతినేని శ్రీహరిరావు,అంబటి సుధాకర్ రెడ్డి, ప్రస్తుత వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు శాంతి, శంకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Related posts

పిల్లలకు పాఠాలు చెప్పని ఉపాధ్యాయురాలు

Satyam NEWS

బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు

Satyam NEWS

గీత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో 5 వేల కోట్లు కేటాయించాలి

Satyam NEWS

Leave a Comment