ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు బంపర్ ఆఫర్. మద్యం దుకాణాలు వరుస ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రూ.2వేల మద్యం బాటిళ్లను రూ.300 డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నారు. దీంతోపాటు మూడు, నాలుగు బాటిళ్లను కొంటే లెదర్ బ్యాగ్‌లు, టూరిస్ట్ బ్యాగ్‌లు, పర్సులు, కీ చైన్‌లు వంటివి గిఫ్ట్‌లుగా ఇస్తున్నారు. ఒక్కోసారి ఫుల్ బాటిల్ కొంటే క్వార్టర్ బాటిల్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారా? తమ వద్ద ఉన్న స్టాక్‌ను వీలైనంత త్వరగా అమ్మేసుకోవాలని వ్యాపారులు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఆ తర్వాత చాలా లైసెన్స్‌లు రద్దయిపోతాయి. దీంతో గతంలో లైసెన్స్‌లు పొందిన వారికి మళ్లీ లైసెన్స్‌లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. ఈ క్రమంలో ఉన్న స్టాక్‌ను వీలైనంత త్వరగా అమ్మేసుకోవాలని వ్యాపారులు ఇలాంటి గిఫ్ట్‌లను ప్రకటిస్తున్నారు.
previous post