23.2 C
Hyderabad
November 29, 2021 16: 27 PM
Slider హైదరాబాద్

మద్యం షాప్ ను వెంటనే తొలగించాలని ఎక్సైజ్ కమిషనర్ వినతిపత్రం

#liquorshop

హైదరాబాద్ లోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి ఎంక్లవే దగ్గర ఉన్న మద్యం షాప్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆదేశానుసారం ప్రజల కోరిక మేరకు తొలగించాలని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫారాజ్ అహ్మద్ కు బుధవారం కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు రావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని నిత్యం రద్దీగా వెళ్లే దారి  రామాలయం కమాన్ దగ్గర నుండి జగద్గిరిగుట్ట కు వెళ్లే మార్గమధ్యంలో వడ్డేపల్లి ఎంక్లేవ్ దగ్గర ఉన్న మద్యం షాపును తొలగించాలని కోరారు. సాయంత్రం వేళల్లో ఆఫీసులు ముగించుకుని వెళ్తున్న ప్రజలకు, మహిళా సోదరీమణులకు  ఇబ్బంది కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని రకాలుగా పార్కింగ్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోనే అనుమతి ఇచ్చేలా చూడాలని అధికారిని కోరామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వడ్డేపల్లి ఎంక్లవే వాసులు తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ శేరిలింగంపల్లి

Related posts

ఫ్లై హై: వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ హుండీ లెక్కింపు

Satyam NEWS

ఈజ్ ఇట్ ట్రూ: పాకిస్తాన్ భూభాగంలో చైనా సైన్యం లేదు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!