సినిమాలలో ఇచ్చే కొత్త కొత్త స్మగ్లింగ్ ఐడియాలతో స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. తాజాగా వచ్చిన పుష్ప సినిమా చూసి ఉత్తేజితుడైన ఒక వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ గా నటించిన అల్లూ అర్జున్ ఒక పాల ట్యాంకర్ కింద ఎర్ర చందనం దుంగలు పెట్టి స్మగ్లింగ్ చేసేవాడు. అందుకోసం ప్రత్యేకంగా ట్యాంకర్ సగానికి అరలాగా తయారు చేయించాడు. సరిగ్గా అదే తరహాలో పుష్ప సినిమా స్టైల్‌లో ట్రక్కులో రహస్య గదులు ఏర్పాటు చేసుకుని ఒక వ్యక్తి మద్యం అక్రమ రవాణా చేస్తుండగా దొరికిపోయాడు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను తయారు చేశాడు. ఇద్దరి స్నేహితులతో కలిసి పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేసి తీసుకువస్తుండగా తనిఖీల్లో గుంటూరు-1 ఎక్సైజ్ పోలీసులు గుర్తించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.
previous post
next post